తెలుగు బిగ్ బాస్ తొండి ఆట ఆడుతున్నాడు..!!

-

21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ సీజన్ ఆరుగురు కంటెస్టెంట్లకు చేరుకుంది. మిగతా సీజన్‌ల కంటే ఈ సీజన్ చప్పగా సాగుతుందనే రూమర్ ఉంది. అయినా బిగ్‌బాస్ 6ను చూసేవాళ్లు లేకపోలేదు. ప్రారంభంతో పోలిస్తే కొద్దిగా మాత్రమే టీఆర్పీ రేటింగ్స్ పెరిగినట్లు తెలుస్తోంది. ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ లో బాగంగా స్ట్రాంగ్ , ఫైర్ బ్రాండ్ అయిన ఇనయా ఎలిమినేషన్ అయ్యింది.

అసలే రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్ బాస్ షో మీద ఇప్పుడు ఇనయా ఎలిమినేషన్  కావడంతో మరింత దాడి మొదలు అయ్యింది. కంటెస్టెంట్ల వచ్చిన ఓటింగ్ బయట పెట్టకుండా బిగ్ బాస్ తొండి గేమ్ ఆడుతున్నాడు అని అంటున్నారు. ఇక ఇనయా ఎలిమినేషన్ అని తెలిసిన ఒక్క రోజులోనే ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ బయట కొచ్చి రచ్చ రచ్చ చేసారు

ఇనయాకు సపోర్ట్ చేస్తూ, తన  ఫ్యాన్స్ స్టూడియో బయట ధర్నా కూడా చేసారు.అన్ ఫెయిర్ ఎలిమినేషన్ ఇనయా” అంటూ ప్లకార్డులతో భారీగా జనాలు వచ్చి, అరవడంతో పోలీసులు వచ్చి జోక్యం చేసుకొని అభిమానులని చెదరగొట్టారు. ట్విట్టర్ లో ‘అన్ ఫెయిర్ ఎలిమినేషన్ ఇనయా’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఒక ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. “ఫేక్ ఎలిమినేషన్, బిబి పాలిటిక్స్, మేనేజ్మెంట్ కోటాలో తొలగించారు” అంటూ ట్వీట్స్ తో ఫ్యాన్స్ రెచ్చిపోయారు.  ట్రెండింగ్ ఇనాయా పేరు ఉంచి నెటిజన్స్ నిరసన తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news