తెలంగాణాలో ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయగా, అపుడే ప్రకటించిన అయిదు రాష్ట్రాలలో ఎన్నికల సందడి మొదలై పోయింది. పార్టీలు అన్నీ కూడా తమ తమ వ్యూహాలు రచించుకుంటున్నారు. ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన క్షణం నుండి ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ ప్రకారం డబ్బు లేదా బంగారం అక్రమంగా రవాణా జరగకుండా చూసుకోవలసిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణాలో అక్రమంగా బంగారాన్ని తీసుకు వెళుతూ పట్టుబడ్డారు. హైదరాబాద్ నిజం క్లబ్ వద్ద మొత్తం 16 కేజీలు బంగారం పట్టుకుని పోలీసులు సీజ్ చేశారు.. ఇది జరిగిన మరికాసేపటికే చందానగర్ లో 5 .65 కేజీల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది.
ఈ ఘటనలో సీన్ లో ఉన్న ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక తెలంగాణాలో ఈ నెలన్నర రోజుల పాటుగా ఎన్నికల కోడ్ అమలులో ఉండనుంది.