దేశంలో కరోనా కేసుల పెరుగుతున్న నేపధ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ దీనిపై ప్రకటన చేసారు. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనాతో 12 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కేసుల సంఖ్య చాలా తక్కువ అని ఆయన అన్నారు. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన,
601 మంది పడ్డారని అంటున్నారు. దేశంలో మొత్తం 2 వేల 902 మందికి కరోనా వైరస్ సోకిందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ తో లింకు ఉన్న కేసుల సంఖ్య 1023 అని ఆయన వివరించారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా తో 68 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. కాగా మన దేశంలో మహారాష్ట్ర కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి కరోనా వైరస్ కేసులు పెరగడం తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణాలో కరోనా వైరస్ బారిన 229 మంది పడ్డారు. కరోనా తో తెలంగాణాలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బారిన 180 మంది పడ్డారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.