బిగ్ బ్రేకింగ్; విశాఖ పర్యటనపై చంద్రబాబు సంచలన నిర్ణయం…!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మళ్ళీ విశాఖ వెళ్తున్నారా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. గురువారం చంద్రబాబు నాయుడు విశాఖ వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో ఊహించని షాక్ తగిలింది. ఆయన విమానాశ్రయంలో దిగి కాన్వాయ్ ఎక్కగానే అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు ఆయన పర్యటనకు అడ్డు పడ్డారు.

ఆయనపై చెప్పులు, రాళ్ళతో దాడికి దిగారు వైసీపీ కార్యకర్తలు. దాదాపు మూడు గంటలకు పైగా చంద్రబాబు నాయుడు విమానాశ్రయంలోనే ఉండిపోయారు, అటు పోలీసులు కూడా ఆయన యాత్ర విరమించుకోవాలని సూచించారు. దీనితో విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నిరసన తెలిపారు. ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోవడంతో భారీగా పోలీసులు మొహరించారు.

ఆ తర్వాత చంద్రబాబుతో చర్చల అనంతరం ఆయన్ను విశాఖలోనే పోలీసులు అరెస్ట్ చేసి… ఆ తర్వాత హైదరాబాద్ విమానం ఎక్కించారు. ఇక అక్కడి నుంచి ఆయన్ను బలవంతంగా తరలించారు అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు కూడా విశాఖ పర్యటన విషయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తా మళ్ళీ విశాఖ వెళ్తా అని ఆయన స్పష్టం చేసారు.

దీనితో చంద్రబాబు విశాఖకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని భావిస్తున్నారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గం ద్వారా విశాఖ వెళ్లేందుకు గాను చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పార్టీ నేతలతో కూడా ఈమేరకు చంద్రబాబు చర్చలు కూడా జరిపారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలకు సమాచారం కూడా ఇచ్చినట్టు సమాచారం. అటు ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కూడా చంద్రబాబు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news