ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా గాని చేసిన తప్పులు మరియు పొరపాట్లకు చాలా మూల్యం కరోనా వైరస్ వల్ల ఆయా దేశాలు చెల్లిస్తున్నాయి. మా దాకా రాదు లే అటువంటిదేమీ ఇక్కడ ఉండదులే అని అనుకున్న వాళ్ళకి ప్రస్తుతం కరోనా వైరస్ వణుకు అంటే ఎలా ఉంటుందో చూపిస్తుంది. దానికి ఉదాహరణ ఇటలీ దేశం. ఇటలీ లో ఉన్న ప్రభుత్వాలు నాయకులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినగాని ఆ దేశ ప్రజలు నిర్లక్ష్యం వ్యవహరించటం తో ఇటలీలో కరోనా వైరస్ మరణ తాండవం చేసింది. సరిగ్గా ఇప్పుడు అదే విధంగా ఇండియాలో కూడా జరుగుతున్నట్లు పరిస్థితులు తెలుపుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వైరస్ ప్రభావం అనూహ్యంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా లో ఎనిమిది పాజిటివ్ కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే ఇండోనేషియా నుంచి రామగుండం మీదుగా కరీంనగర్ కు చేరుకున్న పదిమంది.. వారికి ఢిల్లీలో జత కలిసిన ఉత్తరప్రదేశ్ కు చెందిన మరో వ్యక్తి కారణంగా కరీంనగర్ లో ఇప్పుడు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ టీంలోని ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ అని తేలటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాత్రికి రాత్రే కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దీంతో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో తెలంగాణ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరీంనగర్ జిల్లాలో ఇండోనేషియా దేశానికి చెందిన వాళ్ళు ఎక్కడ ఎక్కడ తిరగటం జరిగిందో? ఎవరిని కలవటం జరిగిందో అన్ని విషయాలను ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా వారు బస చేసిన మసీదును పూర్తిస్థాయిలో శుభ్రం చేయించారు. ఈ దెబ్బతో కరీంనగర్లో అన్ని దుకాణాలను షాపులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కరీంనగర్లో ప్రతి ఒక్కరికి కరోనా వైరస్ టెస్టులు చేయించడం కోసం 100 మంది ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దింపింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఈ వార్త తెలంగాణ మీడియా లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా మారింది.