కరోనా వైరస్ గురించి ఇటలీ దేశ అధికారులు ప్రభుత్వం ఇచ్చిన సూచనలు మనలాగే పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం ఇటలీ దేశమంతా స్మశానం గా మారింది. ఆ దేశ ప్రజలు కుప్పలుతెప్పలుగా చనిపోతున్నారు. ఎక్కువగా ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పట్టించుకోకపోవడంతో…ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ఆ దేశమంతా ఇప్పుడు అతలాకుతలమైంది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంలో కూడా జనతా కర్ఫ్యూ విధించిన గాని తెలుగు రాష్ట్రాల ప్రజలు ….ఇటలీ ప్రజల మాదిరిగానే వ్యవహరించటం అందరికీ భయాన్ని తీసుకు వస్తుంది. ప్రభుత్వం ఎన్ని సూచనలు సలహాలు ఇచ్చిన…ప్రజలంతా చాలా గుంపులు గుంపులుగా రైతు బజార్ లో అదేవిధంగా రోడ్లపై నిత్యావసర సరుకుల దగ్గర సూపర్ మార్కెట్ దగ్గర వెళ్లిపోవడంతో వైరస్ సోకే అవకాశం ఎక్కువ ఉందని అంటున్నారు. ఏ మాత్రం వ్యాధి స్ప్రెడ్ అయి ప్రజలు ఆస్పత్రి పాలైతే…ఎక్కువ వైద్య బృందాలు లేకపోవడంతో చావులు పెరిగిపోయి…ఆసుపత్రులు సరిపోవు మరోపక్క ఈ వైరస్ కి మందు లేకపోవటంతో మరణాలు దారుణంగా సంభవిస్తాయని చాలా మంది చెబుతున్నారు.
కాబట్టి తెలుగు ప్రజలు వీలైనంతవరకు ఇంటిలోనే ఉంటే బెటర్ అని….గుంపులు గుంపులుగా ఎవరూ కూడా బయటకు రాకూడదు అని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు ఈ విషయం సీరియస్ గా తీసుకోకుండా ఉంటే ఊహకి అందని విధంగా….ప్రపంచం మారిపోతుందని, మరో ఇటలీ దేశంగా రెండు తెలుగు రాష్ట్రాలు తయారవుతాయని కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చాలా మంచి వైద్య నిపుణులు సూచిస్తున్నారు.