మ‌హ‌ర్నాట‌కం : అహంకారం తలకెక్కితే… ఏమౌతుందో తెలుసా ?

-

– మ‌ద‌న్ గుప్తా అనే ఓ సోషల్ మీడియా యాక్టివిస్టు పోస్టు ఇది

ఉద్దవుడు గద్దె దింగేందుకు ముందు ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన మాటల్లో కొన్ని విషయాలను చూద్దాం…
నేను మహారాష్ట్ర కోసం చాలా చేశాను….

అవును చాలానే చేశారు… వసూళ్ళు.  పోలీసులకు లాఠీలకు బదులు సంచులిచ్చి డబ్బునింపుకు రమ్మని పంపించారు.  కోవిడ్ ప్రకోపించినప్పుడు ప్రజల ప్రాణాలను గాలికి వదిలి తీసుకోవలసిన చర్యలు తీసుకోకుండా సంవత్సరం పాటు ఇల్లు కదలకుండా చాలా చేశారు.  వేల ప్రాణాలు మీ కోవిడ్ కు బలి అయితే మీరు ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నారు.
నేను హిందూ ధర్మాన్ని వదలలేదు…
అవును వదలలేదు ఇది మాత్రం నిజం…. ఇద్దరు సాధువులను కట్టెలతో కొట్టి అతి దారుణంగా హింసించి చంపుతుంటే మీ పోలీసులు తమాషా చూస్తున్నారు. హనుమాన్ చాలీసా చదివుతామంటే దేశద్రోహనేరం మోపి జైలుకు పంపిస్తారు.  రోజుకు ఐదుసార్లు మైకులు పెద్దఎత్తున మ్రోగుతున్నాయిరా బాబూ అంటే నాకేం వినపించడంలేదు అంటారు.  ఇదంతా ధర్మాన్ని కాపాడడం కాదంటారా…
నేను అన్నీ సహించాను….
అవును మిమ్మల్ని విమర్శిస్తే పాత్రకేయులను సైతం జైలులో ఉంచారు.  విమర్శించినందుకు ఆడకూతురి ఇల్లు ఎవరు ధ్వంసం చేయించారు.  చదువుకునే కుర్రవాడు విమర్శిస్తే జైలు,  రిటైర్డ్ సైనికాధికారి ప్రశ్నిస్తే తమ గూండాలు పని చేస్తారు.  మరి ఎన్ని సహించారు…

నా వారే నాకు వెన్నుపోటు పొడిచారు….
పొడవరు మరి… అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాలలో పెడితే… మనం ఒక్కసారి వెనుక్కు తిరిగి చూసుకుంటే ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచారో తెలుస్తుంది.  కలసి పోటీచేసి హిందువుల ఓట్లు అడుక్కుని నాలుగు సీట్లు సంపాదించుకోగానే అధికార దాహంతో తోటి పార్టీకి వెన్నుపోటు పొడిచింది గుర్తులేదా… అధికారం తలకెక్కి నీ పార్టీ వారికి నీ దర్శనంకూడా దొరక్కుండా చేశావు… నీ ఇంటి ముందు పడిగాపులుకాసి తమ దర్శనం దొరక్క తిరిగి వెళ్ళిన యం.ఎల్.ఎ లు ఏం చేస్తారు.  తండ్రిపేరు అడ్డం పెట్టుకుని అడ్డమైన పనులూ చేస్తూ ఉంటే… ఆ తండ్రి శిష్యులు చూస్తూ ఊరుకుంటారా… ఎక్కడ పొడవాలో అక్కడే పొడిచారు.  అబ్బా పొడిచారే.. అని ఇప్పుడు అనుకుంటే ఏం ప్రయోజనం. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా…
రిక్షావాడి కుమారుడిని నాతండ్రి పెద్దవాణ్ణి చేశాడు నేను మంత్రిని చేశా….
కాబట్టే వారు ఇప్పటి వరకూ నిన్ను భరించారు.  వాళ్ళ కష్టం వల్లనే ఈరోజు శివసేన మనుగడలలో ఉంది.  శివాజీ పేరు చెప్పుకుంటావే.  శివాజీ తన వారసులకు రాజ్యమిచ్చినా అధికారమంతా సమర్ధులైన చిత్పవన్ బ్రాహ్మణులకు అప్పగించాడు.  వారే రాజ్యాన్ని విస్తరించారు, కాపాడారు.  వాళ్ళనే పేష్వాలు అంటారు.  ఆ పేష్వాల వంశానికి చెందిన వాడే షిండే.  ధర్మానికి కట్టుబడ్డాడు కనుకనే నేను ఇప్పటికీ శివసైనికుడినే అంటున్నాడు.  తమరు మాత్ర శివాజీని అవమానించినా, వీర సావర్కర్ ను అవమానించినా నోరు మెదపరు…. ఎంత సహనం.
మీ తండ్రి హిందూ హృదయ సామ్రాట్ రెండు తప్పులు చేశాడు ఒకటి నిన్ను కనడం రెండు నీకు ఉద్దవ్ అనేపేరు పెట్టడం.
ఇప్పటికిది చాలు మరో లేఖలో మరి కొంచెం మీ కోసం

 

మీ మదన్ గుప్త
   01-07-2022

Read more RELATED
Recommended to you

Latest news