హైకోర్టులో సీఎం జగన్, విజయసాయిరెడ్డి లకు భారీ ఊరట

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్, రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డి కి ఊరట కలిగింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ధాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది తెలంగాణ హై కోర్టు.

Jagan
Jagan

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌ మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ తెలంగాణ హై కోర్టు లో పిటిషన్ దాఖలు దాఖలు చేశారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. వారిద్దరి బెయిల్ రద్దు పిటిషన్ పై సిబీఐ కోర్టు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని హై కోర్టు ను పిటిషన్ లో కోరారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. అయితే పిటిషనర్ వాదనలను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసు కోలేదు. అంతే కాదు ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటీషన్ కొట్టివేసింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. ఇక సిబిఐ కోర్టు తీర్పు పై అందరిలోనూ ఉత్కంట నెలకొంది.