డ్రగ్స్‌ కేసులో ట్విస్ట్‌ : పూరి జగన్నాథ్‌, తరుణ్ క్లీన్‌ చిట్‌ !

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ లో డ్రగ్స్‌ కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలుగురు సినీ తారలు చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే… కేసులో బిగ్‌ ట్విస్ట్‌ నెలకొంది. పూరి జగన్నాథ్, నటుడు తరుణ్ నమునాల్లో ఎఫ్ఎస్ఎల్ డ్రగ్స్ లేవని తేల్చింది. పూరి, తరుణ్ రక్తం, వెంట్రుకలు, గోళ్లు పరీక్షించింది తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ.

2017 జులైలో పూరి జగన్నాథ్, తరుణ్ నుంచి నమూనాలు సేకరించిన ఎక్సైజ్.. స్వచందంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారని పేర్కొంది. గతేడాది డిసెంబరు 8న ఎక్సైజ్ కు నివేదికలు సమర్పించింది ఎఫ్ఎస్ఎల్.. కెల్విన్ పై ఛార్జ్ షీట్ తో పాటు వివరాలు కోర్టుకు సమర్పించిన ఎక్సైజ్.. ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు సమర్పించింది. ప్రధాన నిందితుడు కెల్విన్ కు సమన్లు జారీ చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. డిసెంబరు 9న విచారణ కు హాజరు కావాలని కెల్విన్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.