సీఎం జగన్ కు ఊరట.. బెయిల్ రద్దు పిటీషన్ కొట్టివేత

వైసీపీ రెబల్‌ ఎంపీ రఘ రామకృష్ణ రాజు కు మరో ఊహించని షాక్‌ తగిలింది. ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి మరియు విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణ రాజు వేసిన పిటిషన్ ను కొట్టి వేస్తూ… సీబీఐ కోర్ట్ తీర్పు ఇచ్చింది. దీంతో ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి మరియు విజయ సాయి రెడ్డి సీబీఐ కోర్ట్ లో భారీ ఊరట లభించింది.

ఇక ఇది ఇలా ఉండగా…అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లో సీఎం జగన్, రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డి కి ఊరట కలిగింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ధాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది తెలంగాణ హై కోర్టు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌ మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ హై కోర్టు లో పిటిషన్ దాఖలు దాఖలు చేశారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. అయితే.. ఆ పిటీషన్‌ ను కూడా కొట్టివేసింది హైకోర్టు. దీంతో ఒకే రోజు రఘరామకు రెండు ఎదురు దెబ్బలు తగిలినట్లైంది.