50వేల ఉద్యోగాలు భర్తీపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

కరీంనగర్ జిల్లా : లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చామని… త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌ రావు ప్రకటించారు. బిజేపి మాత్రం ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. జమ్మికుంట పట్టణంలో స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు మంత్రి హరీష్ రావు.

harish rao | హరీష్ రావు
harish rao | హరీష్ రావు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మహిళ సంఘాలకు రెండు కోట్ల 13 లక్షల 48 వేల వడ్డి లేని రుణాలు ఇవ్వడం సంతోషంగా ఉందని… బతుకమ్మ పండుగకు మరో కోటి 50 లక్షలు అందిస్తామని ప్రకటించారు. విద్య, వైద్యం, మహిళల అభ్యున్నతి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని… రెండు వందల పెన్షన్ ను రెండు వేల పెన్షన్ చేసుకున్నామన్నారు. 57ఏళ్లు నిండిన వారికి కూడ పెన్షన్ ఇచ్చుకో బొతున్నామని… 57ఏళ్లు నిండిన వారికి ఇస్తే నాలుగు లక్షల మందికి కొత్త పెన్షన్లు వస్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని విధాలుగా వసతులను పెంచిన ఘనత కేసీఆర్ ది అని కొనియాడారు. కేసీఆర్ కిట్ లో జాన్సన్ ఆండ్ జాన్సన్ కంపెనీ ప్రొడక్ట్ లు ఉంటాయని.. అవేమీ నాసిరకం ప్రొడక్ట్ కావన్నారు.