పోలవరం ప్రాజెక్టు ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. అయితే.. తాజాగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి… ఈ ఏడాది అక్టోబర్ 21 నాటికి ఉన్న రూ. 2087 కోట్ల బకాయిలను విడుదల చేయాలని ఏపీ సర్కార్ పోలవరం అథారిటీ.. ని కోరింది. అయితే… రూ. 771 కోట్ల విడుదలకు మాత్రమే పీపీఏ సిఫార్స్ చేసిందని.. కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి భిశ్వేశ్వర్ తుడు ప్రకటన చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చును తిరిగి చెల్లించే విషయంలో జరుగుతున్న అసాధారణ జాప్యం, దీన్ని నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని సోమ వారం వైసీపీ రాజ్య సభ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. బిల్లుల స్క్రూటినీలో రాష్ట్ర ప్రభుత్వం… నుంచి అదనపు సమాచారం కోరాల్సి రావడం.. నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కా గా అనుసరిస్తోందా లేదా వంటి అంశాల నిర్ధారణ లాంటి కారణల వల్ల బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.