Omicron: ఒమీక్రాన్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

-

సౌత్ ఆఫ్రికా లో చాలా మంది కరోనా వైరస్ బారిన పడడానికి కారణం ఒమీక్రాన్ వేరియంట్. ఇది ఇప్పుడు అందరినీ కలవరపరుస్తోంది. చాలా మంది ఇప్పటికే ఈ వైరస్ బారిన పడ్డారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒమీక్రాన్ కోవిడ్ వేరియంట్ అనేది వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని ప్రకటించడం జరిగింది.

 

ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వైరస్ గురించి రీసెర్చర్స్ తో స్టడీ చేయడం జరుగుతోంది.అయితే గతంలో వైరస్ బారిన పడిన వాళ్ళకి కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉన్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా వైరస్ బారిన పడకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

ఇతర వేరియంట్లతో పోల్చి చూసుకుంటే ఒమీక్రాన్ అనేది త్వరగా సోకుతుంది అని తెలుస్తోంది అయితే ఇప్పటికీ కేవలం ఇంత సమాచారం మాత్రమే దీని గురించి తెలిసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి స్టడీ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఇది ఇలా ఉంటే వ్యాక్సిన్ తీసుకునే వాళ్లలో ఈ వ్యాధి ఎక్కువగా రాదు అని తెలుస్తోంది.

ఒమీక్రాన్ వేరియంట్ లక్షణాలు:

ఒమీక్రాన్ వైరస్ ఉన్నవారిలో అలసట ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.. తీవ్రమైన అలసట ఈ వైరస్ కారణంగా వస్తున్నట్లు తెలుస్తోంది. యువకులు కూడా బాగా అలసి పోవడం లాంటి లక్షణాలు మనం చూడొచ్చు. అలానే ఆక్సిజన్ శాచ్యురేషన్ లెవెల్స్ ఇందులో డ్రాప్ అవ్వట్లేదు. మనం కరోనా సెకండ్ వేవ్ లో ఉన్నప్పుడు చాలా మందిలో ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయ్యాయి. కానీ ఈ వేరియంట్ లో అలా లేదు.
ఒమీక్రాన్ వైరస్ బారిన పడిన వాళ్ళల్లో రుచి తెలియటం లేదు మరియు వాసన తెలియడం లేదు అని తెలుస్తోంది. అలానే ఈ వైరస్ బారిన పడ్డ వాళ్లలో చాలా మంది ఆస్పత్రిలో చేరకుండానే కోలుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version