ఏపీలో ఎదగాలనే ఆశలు పెట్టుకున్న బీజేపీపై ఆపార్టీకి చెందిన కీలక నాయకుడు, కేంద్రంలో చక్రం తి ప్పుతున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఒక్కసారిగా నీళ్లు కుమ్మరించారు. వీటి లో ప్రధానమైన రెండు విషయాలను మనం చర్చించుకుందాం. రాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర నష్టం వ చ్చింది. ఈ క్రమంలోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశ లు పెట్టుకున్నారు. ఈ విషయంలో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చినా.. కూడా ఈ విషయంపై స్పందించడం లేదు. అయితే, రాష్ట్ర సీఎం జగన్ మాత్రం ఏపీకి హోదా కావాలని, 15 వ ఆర్థిక సంఘం కూడా దీనికి అనుకూలంగా ఉందని పేర్కొంటూ కేంద్రానికి లేఖ రాశారు.
దీంతో జగన్ తన ప్రయత్నాలు చేస్తున్నారనే వాదన బలపడింది. ఇక, ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. అయితే, దీనిపై వెనువెంటనే స్పందించిన జీవీఎల్.. హోదాపై జగన్ ఆశలు పెట్టుకోవద్దని వెల్లడించారు. అంతటితో ఆగకుండా.., హోదా కోసం యుద్ధం చేసిన చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ పరిణామం.. రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచివేసే అంశం అనేది వాస్తవం. రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీని పట్టించుకునే వారు లేకుండా పోయారు. కానీ, ఇప్పుడు ఇలా మరోసారి రాష్ట్రం ప్రజల మనోభావాలపై దెబ్బకొట్టడం ద్వారా ఆ పార్టీ సాధించేది ఏమీలేదనే విషయాన్ని జీవీఎల్ గుర్తించలేక పోతున్నారు.
ఇక, రాజధాని అమరావతి విషయంలో ఏపీ బీజేపీ నాయకులు ఓ క్లారిటీతో ఉన్నారు. కేంద్రం జోక్యం చేసు కుంటుందని, ఇక్కడ నుంచి రాజధానిని జగన్ అంగుళం కూడా కదలించలేరని వారు వాదిస్తూ వచ్చారు. మీడియాలోనూ ఇదే తరహా ప్రకటనలు చేశారు. కానీ, ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా స్పందించి, రాజధాని విషయం రాష్ట్ర పరిధిలోని దని చెప్పింది. అయితే, దీనికి కొనసా గింపుగా తాజాగా జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ రాష్ట్ర నేతలను మరింత ఇబ్బందిగా మారాయి. కేంద్రం రాజధాని అమరావతి విషయంలో స్పష్టంగా ఉందని ఎవరూ నాటకాలు ఆడొద్దని ఆయన ఒకింత తీవ్రం గానే స్పందించారు.
ఇది నిజానికి టీడీపీ నేతలను, ఎంపీలను ఉద్దేశించి జీవీఎల్ చేసిన ప్రకటనే అయినప్పటికీ.. రాష్ట్ర బీజేపీ నేతలను కూడా డిఫెన్స్‌లోకి నెట్టేసింది. ఇప్పటి వరకు తాము కేంద్రాన్ని బూచిగా చూపించి ఇక్కడ రాజకీయాలు చేస్తుంటే.. మీరు ఇలా వ్యాఖ్యానించి మమ్మల్ని ప్రశ్నార్థంగా మార్చేస్తారా? అంటూ.. అప్పుడే రాష్ట్ర బీజేపీ నేతలు జీవీఎల్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇక, రాష్ట్ర ప్రజలు కూడా బీజేపీతో ఇక ఏదీ సాధ్యం కాదనే భావనకు దాదాపు వచ్చేశారు. ఈ పరిణామాలతో మున్ముందు రాష్ట్రంలో బీజేపీ కోలుకోవడం అంత సులువు కాదని అంటున్నారు పరిశీలకులు. ఒకటి కాకపోతే.. ఒక విషయంలోనైనా బీజేపీ స్పష్టమైన వైఖరి ప్రదర్శించలేక పోతే. ఎలా అనేదివీరి ప్రధాన ప్రశ్న.