BRS కు బిగ్ షాక్.. నిరంజన్ రెడ్డి ఇలాకలో రాజీనామాల పర్వం

-

బిఆర్ఎస్ కు షాక్ తగిలింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇలాఖాలో రాజీనామాల పర్వం మొదలైంది. ఇవాళ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు జడ్పీ చైర్మన్ మరియు ఇద్దరు ఎంపీపీలు పలువురు ముఖ్య నేతలు. రాజీనామా చేసేవారిలో జడ్పీ చైర్ పర్సన్ లోక్నాథ్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి ఉన్నారు.

గత కొద్ది కాలంగా తమకు సరైన గౌరవం లభించడం లేదంటూ పదవులు పేరుకే తప్ప ప్రజలకు సేవ చేయడానికి పనికిరావు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ మెగా రెడ్డి అనుచరుడు పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తో పరాకాష్టకు విభేదాలు చేరాయి.వీరితోపాటు సింగిల్ విండో చైర్మన్ సత్యారెడ్డి, సాయి చరణ్ రెడ్డి, మాజీ జడ్పిటిసి రమేష్ గౌడ్, పెద్దమందడి సర్పంచ్ వెంకట స్వామి సాగర్ లు రాజీనామాకు సిద్ధం అయ్యారు. పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news