రాజకీయ ఇబ్బందుల నుంచి గట్టు ఎక్కకుండానే తెలుగుదేశం పార్టీకి రాజధాని రూపంలో పెద్ద కష్టం వచ్చి పడింది. జగన్ బలం చూసి పార్టీని ఒక్కొక్కరు వదిలి వెళ్లిపోతుంటే వాళ్ళని ఆపడానికి అష్టకష్టాలు పడుతున్న చంద్రబాబుకి రాజధాని రూపంలో మాత్రం గట్టి దెబ్బే తగిలింది. పార్టీలో పైకి కనపడని తిరుగుబాటు మొదలయింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. రాజధాని ప్రకటనలో జగన్ అనుసరించిన వ్యూహం దెబ్బకు, కుదుపు మొదలయింది టీడీపీలో. మూడు ప్రాంతాల నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే కొండ్రు మురళి, గంటా శ్రీనివాసరావు వంటి నేతలు పార్టీని వీడటానికి సిద్డమయ్యారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా చంద్రబాబు సొంత జిల్లా అయిన తిరుపతిలో గట్టి షాక్ తగిలే అవకాశాలు కనపడుతున్నాయి. పార్టీలో బలమైన నేతలుగా ఉన్న అమరనాథ్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి సహా మరో మాజీ మంత్రి పార్టీని వీడే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు అమరాంత్ రెడ్డి. కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు. వీళ్ళు వైసీపీతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.
త్వరలో వీళ్ళు పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. అమరనాథ్ రెడ్డి మరదలు అనీషా రెడ్డి కూడా పార్టీ మారడం ఖాయం అనే టాక్ వినపడుతుంది. ఆమె పెద్దిరేడ్డిపై పోటి చేసి ఓటమి పాలయ్యారు. ఆమె కూడా పార్టీ మారడానికి మార్గం సుగుమం చేసుకున్నారని ఇప్పటికే మంత్రిని కలిసారని అంటున్నారు. వీళ్ళు పార్టీని వీడితే మాత్రం ఆ స్థాయిలో పార్టీకి బలమైన నేతలు ఇక జిల్లాలో లేనట్టే. ఇప్పటికే సొంత జిల్లాలో జగన్ దెబ్బకు పట్టు కోల్పోయిన చంద్రబాబుకి ఈ పరిణామాలు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.