మూడు కోడిగుడ్లకు రూ.1672 బిల్లు..!

-

సాధార‌ణంగా కోడిగుడ్డు ఐదు రూపాయిలు నుంచి ప‌ది రూపాయిల వ‌ర‌కు ఉంటుంది. కానీ.. ఓ స్టార్ హోటల్‌లో మూడు కోడిగుడ్ల‌కు ఏకంగారూ. 1672 బిల్లు వేశారు. ఈ ఘ‌ట‌న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగుచూసింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ రావూజీని అహ్మదాబాద్ నగరంలోని హోటల్ హయత్ రెజెన్సీ 5స్టార్ హోటల్‌లో బస చేశారు. శేఖర్ రావూజీ గురువారం మూడు ఎగ్ వైట్‌లతో భోజనం ఆర్డర్ ఇచ్చారు. అయితే సదరు హయత్ రెజెన్సీ హోటల్ సప్లయర్ మూడు బాయల్డ్ ఎగ్స్ ను ఇచ్చి శేఖర్ చేతిలో 1672 రూపాయల బిల్లు పెట్టాడు.

అంతే ఆ బిల్లు చూసిన శేఖర్ రావూజీ దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. దీంతో ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్ చేశారు. మూడు ఉడికించిన కోడిగుడ్లకు 1350 రూపాయలు, దానికి సర్వీస్ చార్జీగా 67.50 రూపాయలు, దీనిపై సీజీఎస్టీ 9 శాతం కింద 127.58 పైసలు, ఎస్ జీఎస్టీ 9 శాతం కింద మరో రూ.127.58 కలిపి మొత్తం 1672రూపాయలు చెల్లించాలని బిల్లులో పేర్కొన్నారు. దీంతో షాక్ కు గురైన సంగీత దర్శకుడు శేఖర్ రావూజీ హోటల్ బిల్లుతో సహా ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version