యూజ‌ర్ల‌కు ట్విట్ట‌ర్ షాక్‌… డిసెంబ‌ర్ 11 డెడ్‌లైన్‌

-

సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ యాప్‌ల‌లో ఒక‌టి అయిన ట్విట‌ర్ కొద్ది రోజులుగా మిగిలిన పాపుల‌ర్ యాప్‌లు అయిన ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల‌తో పోలిస్తే కాస్త వెన‌క‌ప‌డే ఉంది. తాజాగా ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఓ షాకింగ్ న్యూస్‌ను వెల్లడించింది. ట్విట్ట‌ర్‌లో గ‌త ఆరు నెలుల‌గా ఇన్ యాక్టివ్‌గా ఉన్న యూజ‌ర్లు ఎవ‌రు అయితే ఉన్నారో వారి అక్కౌంట్ల‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ క్రమంలో ఇప్పటికే సదరు యూజర్లకు గాను డిసెంబర్ 11వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు ట్విట్టర్ తెలిపింది. అంటే గ‌త ఆరు నెలుల‌గా ట్విట్ట‌ర్‌లో అన్ యాక్టివ్‌గా ఉన్న నేత‌లు ఎవ‌రు అయితే ఉంటారో ?  వారు త‌మ అక్కౌంట్ల‌ను కోల్పోవాల్సి ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త ఆరు నెల‌లుగా ఏ యూజర్ అయినా సరే ట్విట్టర్‌ను వాడకుండా ఉంటే డిసెంబర్ 11వ తేదీ లోపు ట్విట్టర్ అకౌంట్‌లోకి కనీసం ఒక్కసారి అయినా లాగిన్ అవ్వాలి.

అలా లాగిన్ అవ్వ‌ని ప‌క్షంలో ఆ యూజర్ల అకౌంట్లను డిలీట్ చేస్తామని ట్విట్టర్ తెలిపింది. ఇక ఇటీవ‌ల ఇత‌ర సోష‌ల్ మీడియా యాప్‌ల నుంచి ట్విట్ట‌ర్ గ‌ట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఈ క్ర‌మంలోనే ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ల వృద్ధి రేటు కూడా త‌గ్గుతూ వ‌స్తోంది. చాలా మందికి ట్విట్ట‌ర్ ఖాతాలు ఉన్నా వాడ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు ట్విట్ట‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ విషయమై యూజర్లకు ఈ-మెయిల్ ద్వారా నోటిఫికేషన్లను పంపిస్తున్నట్లు ట్విట్టర్ తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Latest news