ఫలక్ నుమా లేడీ డాన్సర్‌ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ !

-

ఫలక్‌నుమా పరిధిలో ఓ అనుమాస్పద స్థితిలో ఓ లేడీ డాన్సర్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఒంటి పై బట్టలు లేకుండా యువతి మృతదేహం నగ్నంగా కనిపించింది. అయితే.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… అత్యాచారమా లేక గ్యాంగ్ రేపా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తాజా గా ఈ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. లేడీ డాన్సర్‌ శ్రేన్ ఫాతిమా ( 30) ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు..


మృతురాలికీ 6 మంది సంతానం ఉన్నట్లు దర్యాప్తు లో తేల్చారు పోలీసులు. ఆమె భర్త గత సంవత్సరo చనిపోవడంతో… కుటుంబ భారం మొత్తం మహిళానే చూసుకుంటుంది. అయితే… కుటుంబ పోషణ భారం కావడంతో ఆ యువతి సూసైడ్ కు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ యువతి మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు. కుటుంబ సభ్యులు ద్వారా వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news