కరోనా మహమ్మారి వలన చాలా సమస్యలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మహమ్మారి వలన చాలా మంది ఎన్నో ఇబ్బందులతో సతమతమయ్యారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మోదీ సర్కార్ దశల వారీగా ఆన్ లాక్ చెయ్యడం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే లాక్ డౌన్ నిబంధనలను సరళీకరిస్తూ వస్తోంది.
ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ రంగానికి చెందిన ఉద్యోగులు ఆఫీస్‌లకు ఇప్పటికే వెళ్లడం జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నవంబర్ 8 నుంచి కరోనా వైరస్ కారణంగా ఉద్యోగులకు ఇచ్చే ఫెసిలిటీస్ ని తొలగించాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అదే విధంగా ఇకపై ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్ డివైజ్ అటెండెన్స్ ని తప్పని సరి చేసారని కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఉమేష్ కుమార్ భాటియా చెప్పారు. అయితే హాజరుకు ముందు, తర్వాత చేతులను శానిటైజ్ చేసుకోవాలి అని చెప్పారు.
అలానే ప్రతీ ఒక్కరు కూడా కోవిడ్ 19 నిబంధనలు పాటించాలి. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం చాలా అవసరం అని అన్నారు. కనుక ఉద్యోగులు వీటిని ఏ మాత్రం ఉల్లంఘించకుండా తప్పక అనుసరించాలి.