ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్… ప్రతీ ఐదింటిలో నాలుగు కుటుంబాలు ఎఫెక్ట్

-

ఢిల్లో గాలి కాలుష్య తీవ్రత అలాగే ఉంది. దీపావళి తర్వాత నుంచి పెద్ద ఎత్తున గాలి కాలుష్యం ఏర్పడింది. ప్రజలు దీపావళి రోజు టపాసులు పేల్చడంతో పాటు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెడుతుండటంతో దేశ రాజధాని కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా ఓ అధ్యయనంలో ఢిల్లీలో ప్రతీ ఐదు కుటుంబాల్లో నాలుగు కుటుంబాలు కాలుష్యం బారిన పడినట్లు తేల్చింది. దీన్ని బట్ట చూస్తే ఢిల్లీలో కాలుష్యం ఏరేంజ్ లో ఉందో తెలుస్తోంది. దీపావళి తర్వాత నుంచి వరసగా మంగళ వారం కూడా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) దారుణంగా ఉంది.

మరో వైపు ఢిల్లీ కాలుష్యంపై నేడు ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించేందుకు తీసుకోవల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చిస్తామని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. ఇప్పటికే ఎయిర్ పోల్యూషన్ తగ్గించేందుకు వాటర్ గన్స్, ట్యాంకర్ల ద్వారా పొల్యూషన్, గాలిలో దమ్ముధూళిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో నిర్మాణాలను ఆపేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news