కృష్ణా జిల్లాలోని… కొండపల్లి మున్సిపాలిటీ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కొండపల్లి మున్సిపాలిటీ… ఎన్నికల్లో భాగంగా మొత్తం 29 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయితే.. ఇవాళ్టి కౌంటింగ్ లో వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీలు సమానంగా సీట్లు గెలుచుకున్నాయి. అధికార వైసీపీ పార్టీ 14 సీట్లు గెలుచుకోగా… టీడీపీ పార్టీ 14 గెలుచుకుంది. ఇక ఇండిపెండెంట్లు ఒకరు గెలివడం గమనార్హం.
ఇక అటు జనసేన పార్టీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు కొండపల్లి మున్సిపాలిటీ ఫలితాల్లో ఖాతా తెరవలేదు. దీంతో మున్సిపాల్ ఛైర్మన్ పదవి పై తీవ్ర సందిగ్ధత నెలకొంది. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచినటు వంటి ఇండి పెండెంట్ అభ్యర్థి ఇప్పుడు చాలా కీలకంగా మారిపోయారు. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి అధికార వైసీపీ పార్టీకి మొగ్గు చూపుతారా… లేక… ప్రతి పక్ష టీడీపీ పార్టీకి మద్దతు తెలుపుతారా అనేది చూడాలి. ఆ ఇండిపెండెంట్ ఎటు వైపు మద్దతు ఇస్తే.. ఆ పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ కానున్నారు.