బింబిసారా నుంచి బిగ్ అప్డేట్.. వీడియో వైరల్..!!

-

నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈయన కెరియర్ లో ఎక్కువగా సినిమాలు ఫ్లాప్లే ఉంటాయని చెప్పవచ్చు. అయితే చివరిగా ఎంత మంచివాడవురా సినిమా తర్వాత ఎన్నో సంవత్సరాలు గ్యాప్ తీసుకొని కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం బింబిసారా.. ఈ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కళ్యాణ్ రామ్. అయితే ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో వరుస అప్డేట్లను విడుదల చేస్తూ ఉన్నారు చిత్ర బృందం.

ఇక బింబిసారా సినిమా మగధ రాజ్యాన్ని పరిపాలించిన హరియాంక వంశస్తుడైన బింబిసారుని కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది. ఈ సినిమా సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీగా తెరకెక్కించడం జరుగుతుంది. ఈ చిత్రం వచ్చే నెల 5 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో వరుసగా అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు చిత్ర బృందం . ఇప్పటికి ఈ సినిమా నుంచి విడుదలైన పలు పోస్టర్స్ టీజర్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇటీవల కొద్ది రోజుల క్రితం ఒక ఫస్ట్ సింగిల్ సాంగ్ ని విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలోని ఇప్పుడు తాజాగా మరొక పాటను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఈ పాట వైరల్ గా మారుతూ ఉన్నది. ఈ పాట కళ్యాణ్ రామ్ హీరోయిన్ కేథరిన్ మధ్య చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ పాట విజువల్స్ కూడా చాలా కలర్ ఫుల్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి నిర్మాతగా కళ్యాణ్ రామ్ కూడా వ్యవహరిస్తూన్నారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో ద్విపత్రాభినయం చేస్తున్నారు ఇందులో సంయుక్త మీనన్ , హరీనా హుస్సేన్ మరొక కొంతమంది హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news