KHILADI : దీపావళి గిఫ్ట్‌ ముందే ఇచ్చిన ” ఖిలాడీ”

-

మాస్‌ మహారాజ్‌ రవితేజ యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ” ఖిలాడీ”. రమేష్‌ వర్మ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా ను ఏ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్పీ పతాకం పై సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కు సౌండ్‌ ట్రాక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ స్వర పరస్తున్నారు.

ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ముకుందన్‌, మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరి పోయే అప్‌ డేట్‌ వచ్చింది. ఖిలాడీ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. దీపావళి కానుకగా ఈ సెకండ్‌ సింగిల్‌ ను విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్‌ వదిలింది చిత్ర బృందం. ఇక ఈ పోస్టర్‌ లో హీరో రవితేజ తాజా స్టైలీస్‌ గా కనిపించాడు. ఓ ఎడారిలో… బ్యాగ్‌ వేసుకుని నడుచుకుంటూ వెలుతున్నారు మాస్‌ మహరాజ్‌. కాగా… ఈ అప్డేట్‌ తో రవితేజ ఫ్యాన్స్‌ లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news