డార్లింగ్ “ప్రభాస్” పెళ్లి గురించి శ్యామలాదేవి అప్డేట్ !

-

టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలలో ప్రభాస్ ఒకరు.. వయసు ఎక్కువ అవుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదని ఫ్యాన్స్ ఎప్పుడూ అడుగుతూనే ఉంటారు. కానీ ప్రభాస్ డైరెక్ట్ గా ఏ విషయం చెప్పకపోయినా , ఫామిలీ ద్వారా ఫ్యాన్స్ కు రీచ్ అయ్యేలా చేస్తుంటారు. ఈ మధ్యనే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి విజయవాడ లో వెలసియున్న శ్రీకనకదుర్గమ్మ తల్లిని దసరా మహోత్సవాలలో భాగంగా దర్శించుకోవడానికి వచ్చారు. ఇక్కడ మీడియా మిత్రులు శ్యామలాదేవి ని ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నించగా, అమ్మవారి చల్లని చూపులు మా పైన ఉంటే త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఆమె శుభవార్తను అందించారు. శ్యామలాదేవి చెప్పిన ఈ మాటలను బట్టి పెళ్ళికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రభాస్ తీసుకున్నట్లే అనిపిస్తోంది.

మరి ఎవరు ఆ అమ్మాయి ? ఇండస్ట్రీ లో ఉన్న వాళ్ళా లేకా బయట వాళ్ళా ? అన్న పూర్తి వివరాలు తెలియాలంటే ప్రభాస్ ప్రకటించే వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news