నెదర్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా ల మధ్యన చాలా ఆసక్తికరమైన మ్యాచ్ ఇది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అంటే టక్కున సౌత్ ఆఫ్రికా అని క్రికెట్ అవగాహన ఉన్న ఎవరైనా చెప్పేస్తారు. కానీ మ్యాచ్ జరుగుతున్న కొద్దీ సీన్ పూర్తిగా మారిపోతోంది. మొదట బ్యాటింగ్ లో సౌత్ ఆఫ్రికా లాంటి బౌలింగ్ ను అడ్డుకుని 43 ఓవర్లలో 245 పరుగులు చేసింది నెదర్లాండ్. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో సౌత్ ఆఫ్రికాను ముప్పతిప్పలు పెడుతోంది. వరుసగా రెండు సెంచరీలు చేసి ఫామ్ లో ఉన్న డి కాక్ (20), కెప్టెన్ బావుమా (16), మార్ క్రామ్ (1) , డస్సెన్ (4) ఇలా కీలక ఆటగాళ్లు అందరూ నెదర్లాండ్ బౌలింగ్ కు వణికిపోయి అవుట్ అయ్యారు. సీనియర్ బౌలర్ వాన్ డర్ మెర్వ్ రెండు వికెట్లు తీసి జట్టును విజయపధంలో నిలిపాడు. దాదాపుగా సగం గెలుపు నెదర్లాండ్ కు దక్కింది అని చెప్పవచ్చు..
ఇక మిగిలింది మిల్లర్, క్లాసేన్ , యన్సేన్ లను అవుట్ చేస్తే సౌత్ ఆఫ్రికా ఖేల్ ఖతం. కట్టుదిట్టమైన బౌలింగ్ తో నెదర్లాండ్ సౌత్ ఆఫ్రికా ను ముప్పతిప్పలు పెడుతోంది.