తెలుగు బిగ్ బాస్ సీజన్ 6: హగ్ లతో పిచ్చెక్కిస్తున్నారు..!!

-

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రస్తుతం కూరగాయల మార్కెట్ లా నడుస్తోంది. హౌస్ లోని కంటెస్టెంట్లు  తమ చేస్టలతో పిచ్చెక్కిస్తున్నారు. కొంత మంది అమ్మాయిల లను హగ్ చేసుకోవడం లో మునిగిపోతున్నారు. కొంత మంది చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూఉన్నారు. వీళ్ల దెబ్బకి చలాకి చంటి కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. దీంతో అతను దెబ్బకు ఎలిమినేట్ అయిపోయాడు. కొంత మంది ఎవరితో పులిహోర కలపాలి అని ఆలోచిస్తూ వున్నారు.

బిగ్ బాస్ మొదటి నుంచి మంచి గా ఆడుతున్న  కంటెస్టెంట్ లలో ఇనయ ఒకరు. హౌస్ లో కంటెస్టెంట్ల సపోర్ట్ లేకపోయినా  ఒక్కతే  టాస్కులలో ఆడుతూ నెగ్గుతూ వస్తోంది.ఇక నామినేషన్స్ అంటే అందరూ ఈమె మీద పడిపోతున్నారు. దీంతో ఈమె ప్రెస్టేసన్ తో అందరి మీద విరుచుకు పడుతోంది. ఎవరికి తగ్గకుండా తన పవర్ చూపిస్తోంది. ఎక్కడా తాను కృంగి పోవడం లేదు. ఈ కారెక్టర్ జనాలకు విపరీతంగా నచ్చుతోంది.కొన్ని సందర్భాలలో ఆమె లోని రెండో కోణం కూడా  చూపిస్తోంది. ఆర్జే సూర్యను నవ్వుతూ,కవ్విస్తూ వాటేసుకొంటోంది. అతను కూడా దొరికిందే ఛాన్స్ అనుకొని హత్తుకుంటున్నాడు. మరో వైపు సూర్య ను ఎటూ చూడకుండా కట్టడి చేస్తోంది. ఆర్జే సూర్య కూడా ఆరోహి లేక వేరే గత్యంతరం లేక ఈమె వెంట పడ్డాడు.

ఇనయకు సూర్య కంపెనీ బాగా నచ్చింది. అందరూ వదిలేసిన సమయంలో సూర్య రావడంతో అతనితో అతుక్కుపోతోంది. సినిమా లో సీన్ డిమాండ్ చేసినట్లు ఇద్దరూ ప్రతి ఒక్క చిన్న విషయానికి హగ్గులు ఇచ్చుకుంటూ రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. పక్క పక్కనే పడుకోవడం, తల నిమరడం చేసుకుంటున్నారు. ఇంకా చుపించనవి ఎన్ని జరుగుతున్నాయో తెలియదు. ఇది చూసి పక్క కంటెస్టెంట్లు చెవులు కొరుక్కుంటున్నారు. కొంత మంది వారు ఏమి మాట్లాడుతున్నారని చాటు నుండి గమనిస్తున్నారు. బయట నుంచి చూస్తున్న ప్రేక్షకులు మాత్రం హగ్ లు ఇస్తేనే ఎక్కువ కాలం వుంటామని , అపుడే కంటెంట్ వస్తుంది అని ఫిక్స్ అయినట్లు వుందని వ్యంగ్యంగా కామెంట్స్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news