బిగ్‌బాస్ సీజన్ 4 లో 51వ రోజు నామినేషన్ ప్రక్రియ రసవత్తర మలుపు తిరగబోతోంది. ఎంత రచ్చకు ఆస్కారం వుందో అంత రచ్చ ఈ సోమవారం జరగబోతోంది. 50వ రోజు ఎపిసోడ్‌లో దివి నామినేట్ అయి ఇంటి దారి పట్టింది. దీంతో సోమవారం నుంచి మళ్లీ నామినేషన్ ప్రక్రియని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఎవరికి నచ్చని వాళ్లని వారు నామినేట్ చేయాలని బిగ్‌బాస్ టాస్క్ ఇవ్వడంతో ఇంటి సభ్యులు తమకు నచ్చని వారి నామినేట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఎనిమిదవ వారం లోకి ఎంటరైన బిగ్‌బాస్ సీజన్ 4 సోమవారం రసవత్తర మలుపులు తిరుగుతోంది. ఇంటి నామినేషస్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఇంటి సభ్యులు నచ్చని వారి ఫొటోలని పగలగొడుతూ నిమినేట్ చేస్తున్నారు. ఈ దశలో రసవత్తర అంకం మొదలైంది. సెల్ఫ్ నామినేషన్ ప్రక్రియలో కాపాడి తనకు తానే నామినేట్ అయిన హరియానాని మెహబూబ్ నామినేట్ చేయడంతో గొడవ మొదలైంది. ఆ తరువాత అవినాష్.. లాస్యని, హారికని నామినేట్ చేయడం.. ఆ తరువాత హారిక మోహబూబ్‌ని నామినేట్ తో రచ్చ మొదలైంది.
ఈ ఎపిసోడ్‌లో రసవత్తరం ఘట్టం ఏంటంటే లవర్‌బాయ్ అభిజిత్ ఈ నామినేషన్‌లో మోనాల్ ఫోటో పగలగొట్టి మరీ నామినేట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో అమ్మ రాజశేఖర్, అఖిల్ ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మోనాల్‌ని తను అభితో మాట్లోడొద్దని చెప్పలేదని, ఫోర్స్ చేయలేదని అరవడంతో ఈ రోజు గేమ్ మరింత రసవత్తరంగా సాగేలా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో చతికిల పడిన సీజన్ 4కి ట్రాక్‌లోకి తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ఏం జరగబోతోందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Nomination process shuru…Break the silence #BiggBossTelugu4 today at 9:30 PM on @StarMaa pic.twitter.com/oZFeDeU5Mg
— starmaa (@StarMaa) October 26, 2020