తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇవాళ అసెంబ్లీ కమిటీ ని హాల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిస్కో బృందం సమావేశం నిర్వహించింది. స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వంతో సిస్కో సీఎం సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో ప్రీమియర్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పీటర్ మాలినాస్కస్ ఎంపీ బృందంతో తెలంగాణ శాసన సభ కమిటీ హాల్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆస్ట్రేలియా హై కమిషనర్ టూ ఇండియా ఫిలిప్ గ్రీన్ కూడా పాల్గొనడం విశేషం.