బిగ్‌బాస్ సీజన్ 4 ఎనిదవ వారంలోకి ఎంటరైంది. ఆదివారం దివి ఎలిమినేట్ కావడంతో సోమవారం నుంచి మళ్లీ నామినేషన్ ప్రక్రయి మొదలైంది. గత కొన్ని వారాలుగా పడుతూ లేస్తూ వస్తున్న ఈ షో ఈ వారంతో మాంచి రసపట్టుకు చేరేలా కనిపిస్తోంది. ఇంత కాలంగా సభ్యులు ఒకరిపై ఒకరు అంత సీరియస్ నెస్‌ని చూపించకపోయినా ఎనిమిదవ వారంలో మాత్రం తమ మధ్య వున్న విభేధాలని కుండ బద్ధలు కొట్టేశారు.
దీంతో సోమవారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. ఇంటి సభ్యుల ఫొటొలని మార్బుల్స్ పై ప్రింట్ చేయించి నామినేట్ చేయాల్సి వాళ్లు వాటిని పగల గొట్టాలని బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియని ప్రారంభించాడు. ఇంటి కెప్టెన్ అవినాష్ నామినేషన్ ని ప్రారంభించాడు. సిల్లీ రీజన్స్ చెప్పి హారికని, లాస్యని నామినేట్ చేయడం అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత లాస్య.. అమ్మ రాజశేఖర్‌ని.. మోనాల్ని నామినేట్ చేసి వరస్ట్ పెర్పార్మర్ అని రీజన్ చెప్పేసింది. అఖిల్ తనకు నచ్చడం లేదని అరియానాతో పాటు అమ్మ రాజశేఖర్‌ని నామినేట్ చేశాడు.
ఆ తరువాత వచ్చిన అమ్మా రాజశేఖర్ అఖిల్‌తో పాటు లాస్యని నామినేట్ చేశాడు. ఇదే సమయంలో అమ్మకు అఖిల్‌కి మధ్య వాగ్వివాదం జరిగింది. చెండాలపు రీజన్‌లు చెప్పి ఎలిమినేట్ చేయడం నచ్చలేదని అఖిల్ అమ్మపై చిందులు వేయడంతో వాతావరణం హీటెక్కింది. ఆ తరువాత అభిజిత్ రీజన్ చెప్పకుండానే మోనాల్‌ని నేరుగా నామినేట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. తనని మ్యానిపులేటర్ అని అందని, తరువాత తను మరొకరితో క్లోజ్‌గా వుండటం వల్లే తనతో దూరంగా వుంటోందని చెప్పడం అభిజిత్‌ని హర్ట్ చేసిందట. ఇదే రీజన్‌తో మోనాల్‌ని నామినేట్ చేశాడు. ఆ తరువాత చిన్న రీజన్‌తో అమ్మని కూడా నామినేట్ చేయడంతో మళ్లీ ఇద్దరి మధ్య వాగ్వివాదం మొదలవుతుందని అనుకున్నారు కానీ సైలెంట్‌గా ముగిసింది.
అరియానాని మోహబూబ్ నామినేట్ చేయడం ఈ రోజు అందరిని షాక్‌కు గురిచేసింది. తన కోసం గత వారం అరియానా నామినేట్ అయింది. అయినా సరే తనని మోహబూబ్ టార్గెట్ చేయడం ఇంటి సభ్యులతో పాటు వీవర్స్‌కి నచ్చలేదు. ఆ తరువాత మోనాల్‌ని ఎలిమినేట్ చేశాడు. నెక్ట్స్ వీక్ సపోర్ట్ చేస్తానని ప్రామిస్ చేసిన సోహైల్ అలవాటు ప్రకారం ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకోలేకపోయాడు. మోహబూబ్‌ని అరియానా నామినేట్ చేసిందన్న ఒకే ఒక్క కారణంతో అరిమానాని సోహైల్ నామినేట్ చేయడం అతని కన్నింగ్ మెంటాలిటీకి పరాకాష్టగా మారింది. ఇక మోనాల్ లాస్యని, మోహబూబ్‌ని నామినేట్ చేసి అభితో వున్న క్లాష్ ఇప్పటికైనా సమసిపోవాలని, దీనిపై ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా తనని నేరుగా వచ్చి సంప్రదించాలని కోరింది. మండే ఎపిసోడ్ చూస్తుంటే రానున్న వారాల్లో బిగ్‌బాస్ సీజన్ 4 మరింత హీటెక్కి వీవర్స్‌కి కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించేలానే కనిపిస్తోంది. రేపటి టాస్క్ ఇంటి సభ్యుల్లో కొంత మంది చిన్న పిల్లలైతే ఎలా వుంటుంది. మిగతా సభ్యులు వారు చేసే అల్లరిని ఎలా తప్పుకుని వారిని బుజ్జగించాలి అన్న రీతిలో రసవత్తరంగా సాగబోతోంది.