Bigboss 7: కప్పు కొట్టిన రైతుబిడ్డ…

-

ముందు నుంచి అందరు భావిస్తున్నట్టుగానే బిగ్ బాస్ 7 విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అమర్ దీప్ రన్నర్ రప్ గా నిలిచాడు..ఈ సీజన్లో 20 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా, అర్జున్ ,శివాజీ,యావర్, ప్రియాంక,ప్రశాంత్,అమర్ దీప్ లు టాప్ 6 కి వెళ్ళారు. యావార్ టాప్ 4 స్థానంలో ఉండగా, టాప్ 3 స్థానంను శివాజీ దక్కించుకున్నాడు. టాప్ వన్ స్థానం కోసం ప్రశాంత్ మరియు అమర్ దీప్ లు పోటీ పడగా…. ఉత్కంఠగా సాగిన గ్రాండ్ ఫినాలే లో ప్రశాంత్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.

బిగ్ బాస్ విజేతకు రూ.50 లక్షల ప్రైజ్ మనీ అని మనకి తెలిసిందే .కానీ ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్కేసు తీసుకోవడంతో రైతు బిడ్డకు రూ.35 లక్షలు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ టాక్స్, జీఎస్టీ పోగా అతడి చేతికి దాదాపు రూ.17 లక్షలు మాత్రమే  అందనున్నట్లు తెలుస్తోంది. ఈ నగదు తో పాటు ఖరిదైన కారు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఒక సాధారణ రైతు బిడ్డగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి పల్లవి ప్రశాంత్ రికార్డు సృష్టించాడు. దీంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news