ఒకప్పుడు బిజీ షెడ్యూల్ తో స్టార్ హీరోలతో నటించిన సమంత ప్రస్తుతం అనారోగ్య కారణాల వల్ల సినిమాలకి గ్యాప్ తీసుకుంటుంది. ఈ గ్యాప్ లోనే ఆమె విశ్రాంతి తీసుకుంటూ పలు దేశాలకు వెళ్లి మానసిక ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ పెట్టింది. ఇటీవలే భూటాన్ నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చిన సమంత చిన్నపిల్లలతో హాయ్ నాన్న సినిమాని వీక్షించింది. ఇక చాలా రోజుల తర్వాత క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్న సమంత తాజాగా నేటిజన్లతో ముచ్చటించింది.
ఈరోజు ఆదివారం కావడం వల్ల సమంత ఖాళీగా ఉండడంతో సరదాగా ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఏవైనా ప్రశ్నలు అడుగుతే సమాధానం చెప్తా అని చెప్పడంతో పలువురు నెటిజన్స్ ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇందులో భాగంగా ఒక నెటిజన్ సమంతాను మళ్ళీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడగగా దానికి “కి డైవర్స్ స్టాటిస్టిక్” నివేదికను షేర్ చేసి పెళ్లి అనేది ఒక బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అని తెలిపింది. అయితే షేర్ చేసిన నివేదికలో మొదటగా పెళ్లి అయిన వారు 50% రెండవసారి పెళ్లి అయిన వారు 67 శాతం మూడోసారి పెళ్లి చేసుకున్న వారు 70 శాతం విడిపోయే ఛాన్సులు ఉన్నాయని ఉంది. దీంతో సమంత ఇక పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనట్టు అర్థమవుతుంది.