Bigboss6: మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్..!

-

ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగులో ఆరవ సీజన్ ఈ వారంతో ముగియబోతున్న విషయం తెలిసిందే. హౌస్ లోకి ఈ సీజన్లో ఊహించని విధంగా 21 మంది కంటెస్టెంట్లు రాగా ఇప్పటికే 14 వారాలకు గాను 16 మంది ఎలిమినేట్ అయినట్లు సమాచారం. కేవలం ఐదు మంది మాత్రమే ఫినాలే లో ఉండడానికి ఈవారం మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో భాగంగా మరొకరిని పంపించారు అనే వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఆదివారం నుంచి జరిగిన పోలింగ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ ఎలిమినేషన్ చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లను నిర్ణయించి చివరి ఎలిమినేషన్ ప్రక్రియ బుధవారం రాత్రి జరిగింది. ఇక అప్పటినుంచి టాప్ 5 సభ్యులకు మాత్రమే ఓటింగ్ జరుగుతుంది అని కూడా హోస్ట్ నాగార్జున వెల్లడించారు. ముఖ్యంగా వీళ్లలో ఫైనల్ టైటిల్ విన్నర్ ను నిర్ణయించే ఎపిసోడ్ మాత్రం వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ప్రసారం కాబోతోంది. ఇకపోతే మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో భాగంగా శ్రీ సత్య ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఓటింగ్ పోల్స్ లో కూడా చూసుకుంటే చివరి స్థానంలో శ్రీ సత్య ఉన్నట్లు అని తెలుస్తోంది.

సీరియల్ నటిగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ సత్య చికెన్ అంటే పడి చస్తుందని చాలాసార్లు అనిపించుకుంది. అలాగే ఫుడ్ అంటే ఎంతో ఇష్టం ఉన్న శ్రీ సత్య తిండిపోతు , సోమరిపోతుగా కూడా అనిపించుకుంది. మొదటినుంచి నెగిటివిటీని మూటగట్టుకున్న శ్రీ సత్య ఎట్టకేలకు మిడ్ వీక్ ఎలిమినేట్ అవ్వడం పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టైటిల్ విన్నర్ కోసం రేవంత్, శ్రీహాన్, కీర్తి , అర్జున్, రోహిత్ పోటీ పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news