Bigboss6: సూట్ కేస్ ఆఫర్ తో బయటకొచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే..?

-

బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా నిలిచిన వారికి ప్రైజ్ మనీ రూ.50 లక్షలతో పాటు సువర్ణభూమి వారి ఫ్లాట్ ఖరీదు రూ.25 లక్షలు. దీంతోపాటు మారుతి బ్రీజా కారు కూడా వస్తుంది. అయితే ఇక్కడ సూట్ కేస్ ఆఫర్ ఎవరు పొందారు? ఎంత ప్రైజ్ మనీ తీసుకొని బయటకు వెళ్లారు? అనేది ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ గ్రాండ్ ఫినాలే ఆదివారం డిసెంబర్ 18వ తేదీన జరగనుంది. ఈ సీజన్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. రేవంత్, రోహిత్ , ఆదిరెడ్డి, శ్రీహాన్ , కీర్తి భట్ ఐదుగురు ఫైనలిస్టులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

మిడ్ వీక్ ఎలిమినేషన్ భాగంగా శ్రీ సత్య తాజాగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఫైనలిస్టులలో అందరికీ కొన్ని ప్లస్లు, కొన్ని మైనస్ లు ఉన్నాయి. ముఖ్యంగా డబ్బుతో కూడిన సూట్ కేస్ ఆఫర్ బిగ్ బాస్ ఇచ్చే ఈరోజు మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాస్క్ .. ఈ సంవత్సరం కూడా ఐదుగురు ఫైనలిస్ట్ లకు ఈ ఆఫర్ అందజేయనున్నారు హోస్ట్ నాగార్జున. అయితే ఈ ఆఫర్ ఎవరు అందుకుంటారో వారు సూట్ కేసులో ఉన్న డబ్బుతో బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. ఈ బ్రీఫ్ కేసులో రూ.25 లక్షలు ఉంటుంది. అది విన్నర్ ప్రైజ్ మనీ రూ. 50 లక్షలలో సగం అంటే.. విన్నర్ ప్రైజ్ మనీ నుంచే కోత పెట్టి ఈ సూట్ కేస్ ఆఫర్ ఇస్తారు.

తాజాగా ఆదిరెడ్డి బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ టైటిల్ కంటే డబ్బు ఉన్న బ్రీఫ్ కేసును ఎంచుకుంటాడని బజ్ కూడా ఉంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో క్యాష్ బ్యాగ్ తీసుకొని ఆదిరెడ్డి ఇంటి నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి ఆదిరెడ్డి ఈ ఆఫర్ అందుకుంటారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news