Bigboss7: బిగ్ బాస్ కొత్త స్కెచ్.. సీజన్ సెవెన్ లోకి ఆ యంగ్ హీరో..!

-

ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఆరు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఏడవ సీజన్ కోసం సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. వచ్చే జూలై నుంచి బిగ్ బాస్ ఏడవ సీజన్ ప్రారంభించాలని నిర్వాహకులు ఇప్పటినుంచే.. కంటెస్టెంట్లను ఎవరిని తీసుకోవాలి? హోస్ట్గా ఎవరు రానున్నారు ? అనే విషయాలపై పట్టు సాధిస్తుంది. ఈ క్రమంలోనే హోస్ట్ గా నాగార్జున తప్పుకోవడంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కి హోస్ట్ గా యంగ్ హీరో రానా దగ్గుబాటి రానున్నాడని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఆయన సినిమాలేవి లేక ఖాళీగా ఉన్నాడు. ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవ్వడానికి రానా దగ్గుబాటి దాదాపుగా ఒప్పుకున్నాడనే వార్త కూడా చక్కర్లు కొడుతోంది. అయితే రానా దగ్గుబాటి పేరును నాగార్జుననే రికమెండ్ చేసినట్లు కూడా సమాచారం. బిగ్ బాస్ ఆరవ సీజన్ ఎలాగో డిజాస్టర్ అయింది. కాబట్టి ఏడో సీజన్ ను ఎలాగైనా సరే సక్సెస్ చేయాలన్న పట్టుదలతో బిగ్ బాస్ నిర్వహకులు ఉన్నారని తెలుస్తోంది . ఇందులో భాగంగానే వీలైనంత త్వరగా సీజన్ 7 ను ప్రారంభించాలని ప్లాన్ కూడా చేస్తున్నారు.

ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జూలైలో మొదలు పెట్టాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం టాప్ కంటెస్టెంట్ లను వెతికే పనిలో పడింది బిగ్ బాస్. అంతకుముందు సీజన్లో మాదిరిగా బెస్ట్ కంటెస్టెంట్ లను తీసుకోబోతున్నారు. అందులో భాగంగానే యంగ్ హీరో సాయి రోనాక్ కంటెస్టెంట్ గా తీసుకునేందుకు అతన్ని బిగ్ బాస్ టీం సంప్రదించినట్లు సమాచారం . ప్రెషర్ కుక్కర్ , ఛలో ప్రేమిద్దాం వంటి సినిమాలలో హీరోగా నటించిన సాయి రోనాక్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.. ఒకవేళ ఇదే నిజమైతే బుల్లితెర ప్రేక్షకులకు కూడా పరిచయం కానన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news