Bigboss7: టేస్టీ తేజ చెంప వాయించిన షకీల.. ఏమైందంటే..?

-

ఎట్టకేలకు తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 7 నిన్న స్టార్ మా చానల్లో రాత్రి 7 గంటలకు ప్రసారమైన విషయం తెలిసిందే. ఇక ఇందులో ఒక్కొక్కరుగా కంటెస్టెంట్లు తమ ఆటపాటలతో అలరించి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో షకీలా ఎమోషనల్ టచ్ ఇస్తే.. టేస్టీ తేజ మాత్రం వినోదాన్ని పంచుతూ హౌస్ లోకి అడుగుపెట్టాడు. స్టేజ్ పైనే పంచులు పేల్చిన తెనాలి తేజ హౌస్ లోకి అడుగుపెట్టగానే..” తేజ హౌస్ లోకి వచ్చాడు. ఇక మామూలుగా ఉండదు.. అంటూ అప్పుడే ఆట మొదలు పెట్టేసాడు. ఓర్నీ.. హౌస్ లో అందరూ అమ్మాయిలే ఉన్నారంటూ వింత వింత శబ్దాలు చేస్తూ కామెడీ కూడా జోడించాడు.

అంతేకాదు పేరుకు తగ్గట్టుగానే ఫుడ్ ఐటమ్స్ తో నిండిన డ్రెస్ ని ఓన్ గా డిజైన్ చేయించుకుని ధరించిన ఈయన హౌస్ లోకి అడుగుపెట్టగానే.. శోభా శెట్టి వచ్చి..” నీ డ్రెస్ ఏంటి ఇలా ఉంది ఫుడ్ ఐటమ్స్ తో ? నాకు బిర్యానీ కావాలి”.. అనడంతో బిర్యాని తినకుండా నా హార్ట్ ని బుక్ చేసుకున్నారంటూ పంచ్ వేశాడు.ఆ తర్వాత హౌస్ లో శివాజీని పలకరించగా.. వెంటనే దామిని వచ్చి వంట చేసేది మీరేనా ?అని అంటే.. అవును.. బెస్ట్ కుక్కర్.. ఓన్లీ కటింగ్.. నో కుకింగ్ అంటూ పంచేశాడు.

ఇంతలో షకీలా కనిపించడంతో మేడం.. మేడం.. మిమ్మల్ని చూడలేదంటూ వెళ్లి ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. ఇంత పెద్ద ఒళ్ళు ఉన్న మనిషిని ఎదురుగా ఉంటే నీకు కనిపించలేదా అంటూ పంచ్ వేసింది షకీలా. లేదు మేడం.. షకీలా గారు .. చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి పెరిగాను.. నేను మీకు పెద్ద అభిమానిని అని అనగా.. దాంతో షకీలా మళ్లీ రివర్స్ కౌంటర్ ఇచ్చేసింది.. చిన్నప్పుడు ఎవరైనా నా సినిమాలు చూస్తారా? అంటూ చెంప పై చెల్లుమనిపించింది. మొత్తానికి షకీలా, తేజ హౌస్లో నవ్వుల పూయించారు.

Read more RELATED
Recommended to you

Latest news