Asia Cup 2023 : నేడు నేపాల్‌తో భారత్ కీలక మ్యాచ్.. బుమ్రా దూరం

-

ఆసియా కప్‌ 2023 నుంచి టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ ప్రీత్‌ బుమ్రా దూరం కానున్నాడు. నిన్న శ్రీలంక నుంచి ఇండియాకు వచ్చేశాడు టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ ప్రీత్‌ బుమ్రా. ఇవాళ టీమ్ ఇండియా వర్సెస్ నేపాల్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఆసియా కప్ టోర్నమెంట్ 2023లో భాగంగా టీమిండియా మరియు నేపాల్ జట్ల మధ్య ఐదవ మ్యాచ్ పల్లె కెళ్లే వేదికగా జరగనుంది.

ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రారంభం అవుతుంది. ఇక పాకిస్తాన్తో జరిగిన టీమిండియా మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. కాగా… టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ ప్రీత్‌ బుమ్రా భార్య తల్లి కాబోతుందట. ఇవాళ ఆమె డెలివరీ అయ్యే అవకాశం ఉందట. ఈ తరుణంలోనే.. టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ ప్రీత్‌ బుమ్రా.. ఇండియాకు వచ్చేశాడు. ఈ కారణంగా ఇవాళ జరిగే టీమిండియా, నేపాల్‌ మ్యాచ్‌ కు దూరం కానున్నాడు టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ ప్రీత్‌ బుమ్రా.

Read more RELATED
Recommended to you

Latest news