బిగ్‌బాస్ ఫైన‌ల్స్‌ : శ‌్రీముఖి ఫ్యాన్స్ ఓవ‌ర్ యాక్ష‌న్.. చేజారిన బిగ్‌బాస్ 3 టైటిల్..?

-

వంద రోజులకు పైగా ప్రేక్షకులను అలరించిన వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ చివరికి వచ్చేసింది. మ‌రొక్క రోజులో తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ వెర్ష‌న్ 3 విన్న‌ర్ ఎవ‌రో తేలిపోనుంది. మ‌రి ఆ రు.50 ల‌క్ష‌లు సొంతం చేసుకునే విన్న‌ర్ ఎవ‌రో ఆదివారం తేలిపోనుంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్ల‌తో పాటు రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు క‌లుపుకుని 17 మంది కంటెస్టెంట్లు ఈ చాంపియ‌న్ షిప్ కోసం పోటీప‌డ్డారు. ఇప్ప‌టికే వారానికి ఒక‌రు చొప్పున 12 మంది ఎలిమినేట్ అవ్వ‌గా… మ‌ధ్య‌లో ఓ వారం ఎలిమినేష‌న్ జ‌ర‌గ‌లేదు… రాహుల్‌ను బిగ్‌బాస్ ఫేక్ ఎలిమినేష‌న్‌తో షాక్ ఇచ్చి తిరిగి హౌస్‌లోకి పంపాడు.

ఇక ఈ వారం హౌస్‌లో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లు ఫైన‌ల్స్ రేసులో ఉన్నారు. 100 రోజుల జ‌ర్నీలో
ఇక ఇప్పుడు విజేత ఎవరో తేలిపోయే రోజు దగ్గరకొచ్చేసింది. రాహుల్ సిప్లిగంజ్..శ్రీముఖి..బాబా భాస్కర్..వరుణ్ సందేశ్.. అలీ రెజా ఈ ఐదుగురిలో గెలుపెవరిది ? ఇప్పడు బిగ్ బాస్ అభిమానుల్లోనే కాదు.. బుల్లితెర అభిమానులందరిలోనూ నెలకొని ఉంది. ఇక గెలిచేది వీరే అంటూ సోషల్ మీడియాలో గత నాలుగు రోజుల్లోనూ ప్రచారమూ హోరెత్తుతోంది.

ఇక హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన వారు సైతం లోప‌ల ఉన్న త‌మ స‌న్నిహితుల‌ను గెలిపించుకునేందుకు ప్ర‌చారం హోరెత్తించారు. ఇక అంచ‌నాలు, బ‌య‌ట న‌డుస్తోన్న సోష‌ల్ మీడియా సైట్లలో ఓట్ల పోలింగ్ స‌ర‌ళిని బ‌ట్టి చూస్తే పోటీ రాహుల్ సిప్లిగంజ్.. శ్రీముఖిల మధ్యే ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఇప్ప‌టికే ఫైన‌ల్ పోలింగ్ ముగియ‌డంతో విజేత ఎవ‌రో తేలిపోయింద‌ని కూడా అంటున్నారు. వాస్త‌వంగా శ్రీముఖి ముందు నుంచి ఈ సీజ‌న్ ఫేవ‌రెట్‌గా ఉంది.

అయితే బ‌య‌ట శ్రీముఖి ఫ్యాన్స్ చేసిన ఓవ‌ర్ యాక్ష‌న్ కార‌ణంగాను.. లోప‌ల ఆమె రాహుల్‌ను టార్గెట్ చేయ‌డంతో పాటు.. రాహుల్ డౌన్ టు ఎర్త్ ఉండ‌డంతో పాటు ఓపెన్‌గా ఉండ‌డంతో రాహుల్ చివ‌ర్లో శ్రీముఖికి వ‌చ్చిన ఓట్ల‌ను క్రాస్ చేసి వెళ్లిపోయాడ‌ని అంటున్నారు. ప్రస్తుతం బలంగా వినిపిస్తున్న లీకుల సమాచారాన్ని బట్టి ఈ బిగ్ బాస్ విజేత గా నిలుస్తోంది రాహుల్ సిప్లిగంజ్ అని తెలుస్తోంది. బ‌య‌ట ఆమె ఫేక్ ఫొటోల‌తో ఆమె విన్న‌ర్ అంటూ జ‌రిగిన ప్ర‌చారం నేప‌థ్యంలో కూడా రాహుల్‌కు అనుకూలంగా ఓట్ల వ‌ర్షం కురిసింద‌ని తెలుస్తోంది. మ‌రి ఫైన‌ల్‌గా ఏం జ‌రిగిందో ? కొద్ది గంట‌ల్లో తేలిపోనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version