రష్యా అమ్మాయిలకు ఇండియా అబ్బాయిలంటే ఇష్టమట…!

-

కర్నాటకలోని బళ్ళారి ప్రాంతానికి చెందిన ఒక యువకుడు రష్యా వెళ్ళాడు… అక్కడ వైద్య విద్య అత్యుత్తమంగా దొరుకుతుందని భావించిన అతను భారీ ఫీజు కట్టి మరీ జాయిన్ అయ్యాడు. నాలుగు నెలలు అక్కడ అతనికి అంతా కొత్తగా ఉంది… ఈ సమయంలో అతనికి హుడ్నావిచ్ అనే అమ్మాయి పరిచయం అయింది… తన క్లాస్ మేట్, తాను ఉండే వీధిలోనే ఉంటుంది. ఇద్దరు కలిసి రోజు బండి మీద కాలేజికి వెళ్లి వస్తూ ఉండే వారు. ఇతని జీవితం గురించి తల్లి తండ్రుల గురించి ఆమె అడగడం మొదలుపెట్టింది… ఇష్టా ఇష్టాలు తెలుసుకోవడం,

అతనికి కావాల్సినవి ఇవ్వడం, తన కుటుంబాన్ని పరిచయం చేసే వరకు వెళ్ళింది. ఆ యువకుడిని తన ఊరు తీసుకుని వెళ్లాలని కోరింది. ఆ యువకుడు అందుకు అంగీకరించాడు. సెలవలు వస్తే వెళ్దామని చెప్పాడు. ఇదే సమయంలో అసలు ఆమె అలా ఎందుకు ప్రవర్తిస్తుందని గమనించడం మొదలుపెట్టాడు. అతనికి ఎంతగానూ అర్ధం కాకపోవడంతో… ఆమెను అడిగాడు… నా మీద నువ్వు ఎక్కువగా కేర్ తీసుకుంటావని, నువ్వు చాలా శుబ్రంగా ఉండటమే కాదు, ఏది పడితే అది తినకుండా జాగ్రత్తలు తీసుకుంటావని చెప్పిందట ఆమె… అలాగే డబ్బు కూడా పద్దతిగా ఖర్చు చేస్తావని,

తన కుటుంబం కంటే నీతోనే ఎక్కువగా గడపడానికి అదే కారణమని ఆ అబ్బాయికి ఆమె చెప్పిందట. ఇదే అనుభవం తన స్నేహితుడికి కూడా కలిగిందట. అసలు విషయం ఏంటి అంటే… రష్యా అమ్మాయిలూ భారతీయులను ఎక్కువగా ఇష్టపడతారని తెలిసింది… అక్కడి అబ్బాయిల్లో కేరింగ్ తక్కువగా ఉండటం వారికి నచ్చదట… అబ్బాయిలకు ఎక్కువగా ఆధిపత్యం ఉంటుందని, అక్కడి అమ్మాయిలకు అది నచ్చదని అతను తెలుసుకున్నాడు. అబ్బాయి నచ్చితే వాళ్ళు ఎంత వరకు అయినా వెళ్ళడానికి సిద్దంగా ఉంటారని అతనికి అర్ధం కావడంతో ఆమెను వివాహం చేసుకున్నాడట.

Read more RELATED
Recommended to you

Exit mobile version