ఇవేమి కష్టాలురా సామి.. షోని లేపుదామంటే ఎంతకూ అవ్వట్ల.. ఒక్కరంటే ఒక్కరు డేర్ గేమ్ ఆడట్లేదు.. అందరూ సేఫ్ గేమ్ ఆడటానికే ఇష్టపడుతున్నారు. కంట్రవర్సీలు లేవు, లవ్ ట్రాక్‌లు సెట్ కావాట్లేదు.. నాలుగు వారాలకు చేరినా ఇప్పటికీ బిగ్‌బాస్ హౌస్ ప్రశాంతంగా శనివారం.. ఆదివారం అంటూ సాగుతుంది. అబ్బబ్బబ్బ ప్రతీ వారాంతంలో నాగార్జునతో ఏదో ఒక లింక్ సెట్ చేద్దామంటే అస్సలు కుదరట్లా.. బిగ్ బాస్ మాటనూ లెక్క చెయ్యట్ల..
బిగ్‌బాస్ షో మొదటి నుండి షోలో రొమాన్స్, లవ్ సీన్స్ వీరలెవల్లో సెట్ చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు బిగ్‌బాసు. కానీ ఒక్క కంటెస్టంట్ సహకరించట్లేదు. అఖిల్ – మోనాల్ – అభిజిత్ అంటూ తిప్పినా ఈ ముగ్గురూ దద్ది గేమ్ ఆడుతూ సాగదీస్తున్నారు. స్వాతిని ఎరగా వేసి లవ్ స్టోరీస్ ట్రాక్‌లో పెడదామనుకుంటే ఆమెను నామినేషన్‌లో పెట్టి బయటకు పంపేసారు హౌస్‌మేట్స్.
తెలుగుకు తెగులు పట్టిస్తూ దేత్తడి, అభిజిత్‌ల లవ్ స్టోరీ మాత్రం తెలుగు ప్రేక్షకులకు అర్థం కాకుండా ఉంది. ఆ హారికకు తెలుగు అస్సలు రాదేమో అనే అనుమానం కూడా వస్తుంది. తెలుగు మాట్లాడను సారీ అంటూ ఇంగ్లీష్‌లోనే ఇచ్చుకుంది. అభిజిత్ మెగాస్టార్, పవర్‌స్టార్ లెవల్లో ఫోజులు కొడుతూ రాత్రి కాగానే ఒక్కో అమ్మాయితో ఒక అరగంట అందరికీ అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు సోది పెడుతూ అది కూడా ఇంగ్లీష్‌లోనే.. తెగా బోర్ కొట్టించేస్తున్నాడు. అమ్మాయిలతో తప్ప అబ్బాయిలతో కనిపించడు.. మనోడు కృష్ణుడిలా ఫీలవుతున్నాడు. కానీ బాగా తెలివిమంతుడు.. ఎప్పుడు ఎవర్ని ఎక్కడ ఎలా వాడాలో బాగా తెలుసు.. అబ్బాయిలతో అస్సలు పడదు ఈ అబ్బాయికి.
దివీ, లాస్య, సుజాత, కుమార్ సాయి, గంగవ్వ తెలుగులో మాట్లాడుతూ మెల్లి మెల్లిగా పికప్ అవుతున్నారు. లాస్య కన్ఫ్యూజన్‌లోనే నాలుగు వారాలు గడిపేసింది. సుజాత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అందరితో కలిసిపోతూ బాగా ఆడుతుంది. మొదట్లో కొద్దిగా స్లో ఉన్నా రెండో వారం నుండి స్వేచ్ఛగా ఆడుతుంది. మొదట్లో నాగార్జున అన్నట్లే ఈ అమ్మాయి అచ్చ తెలుగు తెలంగాణ అమ్మాయిలా నే కనిపిస్తుంది. ప్రతీ ఇంట్లో అమ్మాయిలు ఎలా ఉంటారో అలాగే అనిపిస్తుంది. అశ్లీలత లేకపోవడం, తెలుగులోనే మాట్లాడటం, ఆడుతూ పాడుతూ నవ్వుతూ పాజిటివ్‌గా ఉండటం సుజాత ప్లస్ పాయింట్స్..
దివి చాలా బాగా ఆడుతుంది. క్లారిటీతో తను ఎం చెయ్యాలో అదే చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కుమార్ సాయి నిజంగానే నక్క తోక తక్కి వచ్చినట్లున్నాడు. అమ్మ రాజశేఖర్ పెద్దరికం చూపిస్తూ ఒక్కోసారి అరవ యాసతో నసపెట్టేస్తున్నాడు. ఇక సోహైల్, మెహబూబ్‌లు మంచి కంటెస్టంట్స్, కసితో ఆడే కంటెస్టంట్స్.
ఇక ఫైనల్‌గా.. నేను చెప్పేది వింటావా బాసు.. వింటానంటే చెబుతా మరి.. నచ్చకపోతే మనిద్దరి కనెచ్చన్ కట్ చెయ్యొద్దు మరి.. ఒకేనా..
లవ్ ట్రాక్స్‌పై కాకుండా గేమ్ మీద దృష్టిపెడితే బిగ్‌బాస్ మంచి హిట్ అవుతుంది. బిగ్‌బాస్ షోలో తెలుగు పక్కాగా మాట్లాడేలా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇక ఆ ఇంగ్లీష్ పక్షులలో ఒకరిని ఇమ్మిడియట్‌గా బయటికి పంపేస్తే షో ఇంకా ఆసక్తిగా మారుతుంది. కెమెరా ఫోకస్ అందరిమీద పెట్టు.. కంటెస్టంట్స్ అందరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వు..
– మీ మాలోకం