BIGG BOSS-5 : శ్వేత వర్మ అవుట్..సీక్రెట్ రూమ్ కు లోబో..!

-

బిగ్ బాస్ సీజన్ 5 వారాలు పూర్తి చేసుకొని ఆరో వారంలో కి అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే 5గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. సరయు, ఉమాదేవి నట్రాజ్ మాస్టర్, హమీద, లహరి హౌస్ నుండి వెళ్లిపోయారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తి గా మారింది. అయితే తాజాగా ఈవారం హౌస్ నుండి శ్వేతా వర్మ ఎలిమినేట్ అయింది అంటూ లీకు రాయుళ్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రోమోలో నాగార్జున ఈ వారం హౌజ్ నుండి ప్రియా లేదా లోబో వెళ్తారు అని చెబుతున్నారు.

అంతేకాకుండా ప్రోమోలో ఇద్దరిలో ఒకరు వెళ్తున్నట్టు చూపిస్తున్నారు. ఇద్దరిలో లోబో ఎలిమినేట్ అవ్వడం వాస్తవమే కానీ లోబో సీక్రెట్ రూమ్ లో కి పంప బోతున్నాడు అనేది ప్రచారం జరుగుతోంది. లోబో ఎంట్రీ ఇచ్చిన మొదటి మూడు వారాల్లో వినోదాన్ని పంచారు కానీ ఆ తరవాత సైలెంట్ అయ్యాడు. అంతే కాకుండా రవి కు బంటు లా హౌజ్ లో కొనసాగుతున్నాడు. అయితే అతడిని సీక్రెట్ రూమ్ కు పంపించడం స్వీట్ వార్నింగ్ లా కనిపిస్తుంది. అంతే కాకుండా ఈ వారం హౌస్ నుండి శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news