Bigg Boss త‌మిళ బిగ్ బాస్‌లో తెలుగు కాంట్రవర్సీ బ్యూటీ..!

-

Bigg Boss: బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‏బాస్. అత్యంత ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నరియాల్టీ షో. బిగ్ బాస్ ఇటు తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం భాషలలో దూసుక‌పోతుంది. మంచి టీఆర్పీతో సక్సెస్‏ఫుల్‏గా ప్ర‌సారం అవుతుంది. ఇటీవల తెలుగులో ప్రారంభమైన బిగ్‏బాస్ షో 5 సీజ‌న్‌కు అన్యూహ స్పంద‌న వ‌స్తుంది. ఎన్నాడు లేని విధంగా రేటింగ్ కూడా రికార్డు స్థాయిలో వస్తుంది.

ఈ క్ర‌మంలోనే .. తాజా తమిళంలో కూడా బిగ్ బాస్ త‌మిళ్‌ ఐదో సీజన్ మొదలవుతుంది. దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ అక్టోబర్ 3 ఆదివారం నాడు ప్రసారమైంది. తెలుగు షోలో 19మందిని తీసుకోగా.. తమిళంలో 18 మంది కంటెస్టెంట్స్ తీసుకొస్తున్నారు నిర్వాహకులు. ఈ షోకు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. తమిళ బిగ్ బాస్‌లో పాల్గొనే అవ‌కాశం ఓ తెలుగమ్మాయికి ద‌క్కింది. ఆమె పేరు పావని రెడ్డి.

తెలుగు, తమిళ్ లో సీరియల్స్ లో నటిస్తున్న‌ ముద్దుగుమ్మ పావని రెడ్డి. ఆమె తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె తెలుగులో అగ్నిపూలు, నేను ఆయన ఆరుగురు అత్తలు సీరియల్ లో నటించింది. కానీ వీటితో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాక‌పోవ‌డంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది.

అక్కడ ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. ఆమె సిరియ‌ల్ తో పాటు అప్పుడ‌ప్పుడూ చిన్న సినిమాల్లో మెరిసింది. ఆమె ది ఎండ్, డబుల్ ట్రబుల్, లజ్జ, డ్రీమ్ లాంటి చిత్రాల్లో న‌టించింది. తెలుగులో కేవలం నటిగానే కాకుండా కాంట్రవర్సీలతో చాలా పాపుల‌ర్టీ సంపాదించుకుంది. ఆమె భర్త, తెలుగు టీవీ నటుడు ప్రదీప్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో పావ‌ని రెడ్డి పాత్ర ఉంద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.
ఏది ఏమైనా.. ప్ర‌స్తుతం త‌మిళ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. ఆ క్రేజ్‌తోనే బిగ్ బాస్ లో పాల్గొనే అవ‌కాశం ద‌క్కించుకుంది. ఈ తమిళ బిగ్ బాస్ ఫ్లాట్ ఫామ్ ను ఏ విధంగా ఉప‌యోగించుకుంటుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news