దళితులకు రక్షణ లేదు : నారా లోకేష్

వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేదని టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం గ్రామసభలో సీజేఎఫ్ఎస్ భూములకు సంబంధించి సరైన పత్రాలు లేకున్నా ఆమోదించాలంటూ ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదనే అక్కసుతో దళిత సర్పంచ్ మాచర్ల పై వైసీపీ నేతలు, వాలంటీర్ కలిసి దాడి చేసారని నారా లోకేష్ ఆరోపించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.ys jagan on nara lokesh

ఒళ్లు బలిసి దళితుల పై దాడులు చేస్తున్న వైకాపా నేతలకు బుద్ధి చెప్పాల్సింది పోయి పోలీసులు నిందితులను రక్షించే ప్రయత్నాలు చెయ్యడం బాధాకరమని అన్నారు. సర్పంచ్ మాచర్ల పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా సర్పంచ్ మాచర్ల తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సరైన పత్రాలు లేకున్నా రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారని..నో చెప్పడంతో దాడి చేశారని ఆరోపిస్తున్నారు.