Bigg Boss 5: హమీదాతో శ్రీ‌రామ్ డేట్..! అలిగిన ప్రియాంక

-

Bigg Boss 5: బిగ్ బాస్ 5.. ప్రేక్ష‌కుల‌కు ఫైవ్ మ‌చ్ ఎంట‌ర్ టైన్ అందిస్తూ.. ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతుంది. జోరుగా సాగుతున్న ఈ షోలో నాలుగోవారం కెప్టెన్‏గా సింగ‌ర్ శ్రీ రామ్ ఎన్నికయ్యారు. కాగా, ఈ వారం లగ్జరి బడ్జెట్ టాస్క్ భాగంగా రెండు రోజులుగా తిన‌డానికి తిండి లేకుండా చేశాడు. ఆకలితో అలమటించేలా చేశాడు. కానీ.. శుక్రవారం ఎపిసోడ్ మాత్రం వేరేలా సాగింది. హౌజ్‌మేట్స్ ను ఎంట‌ర్టైన్ చేశారు బిగ్ బాస్‌. హౌస్‌లో నవ్వులు పువ్వులు పూయించారు. ముఖ్యంగా సన్నీ అందరిని ఇమిటేట్ క‌డుపుపుబ్బ నవ్వించారు. అలాగే.. శ్రీ రామ్‌తో ఓ వైరెటీ ఇంట‌ర్యూ కు తెర తీశాడు బిగ్ బాస్‌. అయితే.. అక్టోబర్ 1న జ‌రిగిన ఎపిసోడ్‏లో ఏం జరిగిందో ఓ సారి చూసేద్దాం.

శుక్ర‌వారం ఏపిసోడ్‏లో కంటెస్టెంట్ల మ‌ధ్య లగ్జరీ బడ్జెట్ టాస్క్ పెట్టేశాడు. కొంత మంది సభ్యుల‌ను సెల‌క్ట్ చేసి.. వారితో ఓ ఫ‌న్నీ గేమ్ నిర్వ‌హించారు. హౌస్ చాలా స‌ర‌దా.. స‌ర‌దాగా ఉందనుకునే లోపే.. ఇంట్లో కంటెస్టెంట్ల మ‌ధ్య‌ చిచ్చు రేపాడు. ఇంటి సభ్యులు బెస్ట్, వరస్ట్ కంటెస్టెంట్ ఎవరనేది తమ అభిప్రాయాన్ని చెప్పాలని ఆదేశించాడు. ఫైన‌ల్ గా బెస్ట్ పర్ఫామర్‏గా మానస్‏, వరస్ట్ పర్ఫామర్‏గా జెస్సీ ఎన్నిక‌య్యారు. ఇందులో భాగంగా ఫాపం జెస్సీ.. మ‌ళ్లీ జైలుకు వెళ్లాడు. ఇలా హీట్ గా ఉన్న హౌస్ ను కూల్ చేయ‌డానికి .. బిగ్‏బాస్ స్పెషల్ షోను క్రియేట్ చేశాడు. ఈ స్పెషల్ షోకు సన్నీ .. యాంక‌ర్‌గా వ్యవహరించ‌గా.. సింగ‌ర్ శ్రీరామ చంద్ర స్పెషల్ గెస్ట్‏గా ఎంట్రీ ఇచ్చాడు.

ఇక వీజే సన్నీ తనదైన స్టైల్లో శ్రీ‌రామ్‌ను టార్గెట్ చేశాడు. చిలిపి ప్ర‌శ్న‌లు వేస్తూ.. శ్రీ‌రామ్‌ను ఇర‌క‌టంలో ప‌డేశాడు. ఈ క్రమంలో కాజల్‌ మైక్‌ అందుకుంటూ సిరి, హమీదాలలో ఎవరిని ఎంచుకుంటారని సింగర్‌ను సూటిగా ప్రశ్నించింది. దీనికతడు లంచ్‌ టైమ్‌లో సిరి, డిన్నర్‌ టైమ్‌లో హమీదా అని తెలివిగా ఆన్సరిచ్చాడు. దీంతో టిఫిన్ సమయానికి ఎవరు అంటూ నవ్వులు పూయించాడు సన్నీ. ఇన్నాళ్లు తన గుండెల్లోమ్యూజిక్ తప్ప ఎవరు లేరని, మంచి అమ్మాయి కోసం వెయింటింగ్ అని చెప్పాడు.

హౌజ్ మేట్స్ లో ఉన్న వారిలో ఎవరిలాంటి అమ్మాయిని కోరుకుంటున్నావ్ అని ప్ర‌శ్నించ‌గా.. ప్రియ, ప్రియాంక, శ్వేత, కాజల్, యానీ మాస్టర్, సిరిలలో ఒక్కో క్వాలిటీని చెప్పువ‌చ్చాడు. కానీ.. సిరి ద‌గ్గ‌ర ఆగిపోయాడు. ఒక‌వేళ‌.. సిరి కమిటెడ్ కాకపోయి ఉంటే.. తాను త‌న‌ని క‌చ్చితంగా ట్రై చేసేవాడినని
ఓపెన్ అయ్యాడు. నీ టెస్ట్ ఇంత బ్యాడ్ అనుకోలేదని భ‌య్యా అని యాంక‌ర్ ర‌వి ఫన్నీ కౌంటర్ చేశాడు.
అనంతరం ప్రియా.. ప్రియా.. అనే పాడి ఇంటి సభ్యులను రొమాంటిక్ ఫీల్ లోకి తీసుకెళ్లాడు.

ఆ తర్వాత ప్రియా మైక్ తీసుకుని.. ఇక్కడున్నవారిలో ఎవరితో డేట్‌కు తీసుకెళ్తావ్ అని అడ‌గగా.. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా హమీదా పేరు చెప్పి షాకిచ్చాడు. ఆ త‌రువాత ఓ రొమాంటిక్ సాంగ్ కు హ‌మీదాతో డ్యాన్స్ చేస్తూ ఎంతో క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఇక‌ శ్రీరామ్‌, హమీదాల రొమాన్స్ చూసి ఫేస్ ఫీలింగ్స్ మార్చుకుంది. అలిగి లోప‌లికి వెళ్లిపోయింది. ఇక నిన్న‌టి షోలో సన్నీ పర్‌పార్మెన్స్ అదుర్స్‌.. అందరిని ఇమిటేట్ చేస్తూ కడుపుబ్బ నవ్వించాడు.

Read more RELATED
Recommended to you

Latest news