Bigg Boss 5 Telugu: లోబో రెమ్యునరేషన్ ఎంత‌? నెట్టింట్లో వైర‌ల్ !

-

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ రియాల్టీ షో.. బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న షో. ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్లు పూర్తి చేసుకుని.. విజ‌య‌వంతంగా టాప్ రేటింగ్ తో ఐదో సీజ‌న్ లో దూసుకెళ్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎలాంటి టాస్కులు వస్తాయో బిగ్ బాస్ లో చెప్ప‌డం క‌ష్టం. ఇలాంటి షోలో పార్టీసిపేట్ చేయాల‌ని అంద‌రికి ఉంటుంది. పాపులారిటీ ఉన్న వాళ్ల‌ను కింద ప‌డేయ్యోచ్చు. ఎలాంటి పాపులారిటీ లేనివారిని స్టార్స్ గా మార్చ‌వ‌చ్చు. ఇలా ఐదవ సీజన్‏లో ఎంటర్ టైనర్ ఆఫ్ ది హౌస్ గా అడుగు పెట్టిన కంటెస్టెంట్ లోబో.. ఈ షో తో మ‌రింత క్రేజ్ సంపాదించుకున్నాడు.

త‌న‌దైన శైలిలో హౌస్ లో పుల్ ఎంట‌ర్ టైన్ చేశాడు. పుల్ జోష్ నింపాడు. కానీ.. మూడు వారాల త‌రువాత ప‌లు ఘ‌ట‌న‌ల‌తో కాస్త డ‌ల్ అయ్యాడు. ప్రతిసారి బస్తీ నుంచి వచ్చాను అంటూ చిరాకు పుట్టించాడు.
అలాగే.. తాను ఒక్క‌డే గేమ్ ఆడ‌కుండా.. రవి చెప్పిన‌ట్టు వినే వాడని లోబోపై పూర్తిగా నెగిటివ్ టాక్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో లోబో ఎలిమినేట్ చివ‌రి అంచుల్లోకి వెళ్లి వ‌చ్చారు. ఆ త‌రువాత సీక్రెట్ రూంలో పంపించారు. అయితే.. లోబో ఆట తీరులో ఎలాంటి మార్పు రాలేదు.

దీంతో ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయ్యారు లోబో. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడ‌నే టాక్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. రోజూకీ దాదాపు రూ. 35 వేల చొప్పున… వారానికి లక్ష ఎనభై వేల వరకు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎనిమిది వారాలకు గానూ.. లోబో దాదాపు రూ. 20 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా టాక్ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news