చలికాలంలో ఈ తప్పుల్ని మరచిపోయి కూడా చెయ్యద్దు…!

-

చలికాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చలికాలంలో జలుబు, దగ్గు, ఫ్లూ వంటివి రాకుండా జాగ్రత్త పడాలి. వెచ్చగా ఉండే బట్టలు ధరించడం, వేడి నీళ్లు తాగడం లేదా కాఫీ వంటివి తాగి చలి నుండి బయట పడచ్చు. అయితే చలి కాలంలో చాలా మంది ఎక్కువ సేపు వేడినీళ్లతో స్నానం చేస్తూ ఉంటారు.

దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఎక్కువసేపు వేడినీళ్ళతో చలి కాలం లో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం దురద కలగడం, పొడిబారిపోవడం, యాక్ని వంటి సమస్యలు వస్తాయి.

బట్టలు:

వేడిగా ఉండాలని చాలా మంది ఎక్కువ బట్టలు ధరిస్తారు. అయితే ఇలా చేయడం వల్ల ఓవర్ హీట్ అయిపోతుంది. ఓవర్ హీట్ అయిపోవడం వల్ల రోగనిరోధక శక్తి సరిగ్గా పనిచేయదు.

అధికంగా తినడం:

బాగా ఎక్కువగా తినడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. అందుకని చలికాలంలో లిమిట్ గా తినాలి.

కెఫిన్:

చలికాలంలో చాలా మంది టీ, కాఫీలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే రోజుకి రెండు నుండి మూడు కంటే ఎక్కువ కప్పులు తీసుకోవడం మంచిది కాదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

నీళ్లు తాగడం:

చలి కాలంలో చాలా మంది తక్కువ నీళ్లు తాగుతూ ఉంటారు. అయితే యూరిన్ మరియు చెమట వల్ల బాడీలో ఉండే నీళ్లు బయటికి వచ్చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కువ నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ కి గురవుతారు. దీంతో కిడ్నీ సమస్యలు, అజీర్తి సమస్యలు వస్తాయి. కాబట్టి చలికాలంలో ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తపడండి. లేదంటే ఇబ్బందులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news