Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో.. ఇప్పటికే ఏడు వారాలు, ఏడు ఎలిమినేషన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఎనిమిదో వారం మరో కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేయడానికి సిద్దంగా ఉంది. ఇదిలా ఉంటే.. శనివారం.. వీకెండ్ షో.. వచ్చేయడంతో బిగ్ బాస్ స్టేజ్ పైకి నాగార్జున వచ్చేసాడు. సాధారణంగా శనివారం అంటేనే కింగ్ నాగార్జున వచ్చి.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకే రోజు.. ఎవరు తప్పు చేసినా నాగ్ వాళ్ళకి క్లాస్ పీకుతూ, వార్నింగ్ ఇస్తాడు. ఒకవేళ పెర్ఫార్మెన్స్ బాగుంటే ప్రసంశలు కురిపిస్తాడు.
ఈ వారం కూడా అలాగే.. జరిగింది. కానీ, నిన్నటి ఎపిసోడ్లో.. యాంకర్ రవిని నాగార్జున ఘోరంగా అవమానించారు. యాంకర్ రవిని హౌస్‌లోకి ఆటటం కోసం తీసుకోచ్చారా? లేదంటే ఏదో రకంగా అవమానించి.. తానంత తానే వెళ్లిపోయాలా చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి. యాంకర్ రవి ఎక్కడ నోరు తెరిసినా తప్పు చేసినట్టు భావిస్తున్నారు. బిగ్ బాస్ టీం.. లహరి విషయంలో రవి వ్యవహరించిన తీరు బట్టి.. టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. కన్నింగ్, గుంటనక్క, మోసగాడు, నిన్నటి షోలో రవికి మిత్రలాభం కన్న మిత్ర భేదం ఎక్కువ తెలుసు అనుకుంటూ ఎదో రకంగా అతని ఆట తీరును ప్రభావితం చేస్తూ వస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ కూడా రవిని ఘోరంగా అవమానించారు.. పోతే పో అనేశారు నాగార్జున.
అయితే.. గత వారం సిరి, షణ్ముఖ్‌లతో మాట్లాడుతూ.. తన హోం సిక్ గురించి వెల్లిబుచ్చారు. తాను డబ్బుల కోసం.. ఈ షోకి రాలేదని అన్నారు. తన భార్య, కూతురు ఎలా ఉన్నారో ? తెలియడం లేదని ఎమోషనల్ అయ్యారు. తానే ఇంటికి పెద్ద అని.. తన మీద చాలా బాధ్యతలు ఉన్నాయని, ఇప్పటివరకూ తన ఫ్యామిలీ విడిచి ఎటు వెళ్లాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు ఎలా ఉన్నారో బిగ్ బాస్ టీం చెప్పాలని, లేదా తననైనా బయటకు పంపాలని రవి కోరాడు. అయితే ఈ విషయాన్ని టార్గెట్ చేస్తూ.. నాగర్జున యాంకర్ రవిని ఓ రేంజ్లో క్లాస్ పీకారు.
‘ఏంటి రవీ.. ఏం ప్రాబ్లమ్.. హౌస్ లో చాలా డల్ గా ఉంటున్నావ్.. నీ గేమ్ కూడా చాలా స్లో అయింది. నీకు నీ ఫ్యామిలీ దగ్గర నుంచి లెటర్స్, గిఫ్ట్స్, బొమ్మలు కూడా వచ్చాయి కదా..’ అంటూ షణ్ముఖ్, సిరిలతో రవి మాట్లాడిన వీడియోను ప్లే చేశారు. చెప్పు.. నీకేనా ఫ్యామిలీ ఉంది? మిగితా వారికి ఎవరికీ ఫ్యామిలీ లేదా? నీ కోసం బిగ్ బాస్ రూల్స్ మార్చాలంటావా? ఫ్యామిలీ నుంచి ఎప్పుడూ చెప్పాలో .. ఎలా ఇన్ఫర్మేషన్ పంపాలో మాకు తెలుసు.. నీకోసం బిగ్ బాస్ రూల్స్ మార్చాలేం కదా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉండగలవని చెప్పడమే ఈ గేమ్ ఉద్దేశం.. నువ్ .. ఈ గేమ్ గురించి అన్నీ తెలుసే.. రావడానికి ఒప్పుకున్నావ్ గా.. నిన్ను ఎవరొచ్చి అడిగారు.. వెళ్లాలని అనుకుంటే వెళ్లిపో.. డబ్బు కోసం రాలేదని అంటున్నావ్.. నీకు కావాలంటే వెళ్లిపోవచ్చు.. పోతావా? గేట్లు ఓపెన్.. వెళ్లిపోతానంటే ఇప్పుడే వెళ్లిపోవచ్చు.. గేట్లు ఓపెన్ చేయిస్తా’ అంటూ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. దారుణంగా అవమానించారు.
తన ఫ్యామిలీ గుర్తు వచ్చిందనీ.. గతంలో ఎప్పుడూ ఇన్ని రోజులు ఫ్యామిలీకి దూరంగా ఉండలేదని, చెప్పిన పట్టించుకోలేదు. గత సీజన్లో.. ఇక్కడ సరిగా తినడానికి ఉండటానికి లేదని కంటెస్టెంట్స్ గొడవ చేసిన సందర్బాలు చాలా ఉన్నాయి. బిగ్ బాస్‌ని ఘోరంగా బూతులు తిట్టారు. అప్పుడెప్పుడూ ఆ కంటెస్టెంట్లను ప్రశ్నించని బిగ్ బాస్ టీం.. ఇప్పుడూ యాంకర్ రవినే ఎందుకు టార్గెట్ చేసినట్లు అర్థం కావడంలేదు. రవి ప్రవర్తన బాగా లేకపోతే.. ఎలిమినేట్ చేసి బయటకు పంపిస్తే సరిపోతుందిగా.. ఇంతలా అవమానించాలా? ప్రతి మాటకి అతని టార్గెట్ చేయడం సరికాదు. నిన్నటి విషయాన్ని రవి ఏవిధంగా తీసుకుంటాడో.. తన గేమింగ్ స్టైలో ఎలాంటి మార్పులు చేస్తాడో. వేచి చూడాలి.