దేశంలో ఆత్మహత్యలు పెరిగి..రోడ్డుప్రమాదాలు తగ్గాయట.. NCRB ఏం చెప్పిందంటే..!

-

మనదేశంలో ఎప్పుడూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ తాజాగా నేషనల్ క్రైన్ రికార్డ్ బ్యూరో వెల్లడించిన నివేదిక ప్రకారం రోడ్డుప్రమాదాలకు సంబంధించిన మరణాలు తగ్గి..ఆత్మహత్యలు మాత్రం విపరీతంగా పెరిగాయి. 2020 జనవరి నుంచి డిసెంబర్ వరకూ వచ్చిన నివేదిక ప్రకారం.. ఆత్మహత్యల మరణాలు సంఖ్య గణనీయంగా పెరిగిందట. నివేదిక ఏం చెప్తుందంటే..

hanging

ఆత్మహత్యల నుంచి 153,052 మరణాలు సంభవించాయట. 1967 నుంచి చూస్తే గత ఏడాదిలోనే అత్యధికంగా పెరిగాయి. ఈ సంఖ్య 2019 నుంచి పోల్చుకుంటే 10% పెరిగింది. 1967 నుంచి తీసుకుంటే నాలుగో అత్యధిక సంఖ్య. ఇలా మనుషులు తమ జీవితాన్నే వద్దనుకోనే ఆత్మహత్య చేసుకోవటం ఏమాత్రం మంచి విషయం కాదు. 2020లో ప్రతి లక్ష జనాభాకు ఆత్మహత్యల మరణాల సంఖ్య 11.3గా ఉంది. ఇది గత 10 ఏళ్లలో అత్యధిక రేటు కాగా 2010లో మాత్రం 11.4గా నమోదైంది.

లాక్‌డౌన్‌ ఒత్తిడి వల్లే ఆత్మహత్యలు పెరిగాయా?

నిపుణుల గణాంకాలను పరిశీలిస్తే ఈ ఆత్మహత్యలకు కారణం లాక్‌డౌన్‌ అనే వినిపిస్తోంది. మార్చిలో ప్రారంభమైన 68 రోజుల కఠినమైన లాక్‌డౌన్ తర్వాత పాఠశాలలు, కళాశాలలు తెరవకపోవడంతో చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. దీనివల్ల ఆత్మహత్యలు బాగా పెరిగాయి. భారతదేశంలో 29 మిలియన్ల మంది విద్యార్థులకు డిజిటల్ పరికరాలు విక్రయించే సామర్థం లేదు. ఈ కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అనేక నివేదికల్లో తేలింది. అలాగే పేదరికం వల్ల 69%, నిరుద్యోగం వల్ల 24% ఆత్మహత్యలు నమోదయ్యాయి. మాదకద్రవ్యాల దుర్వినియోగం లేదా మద్యపాన వ్యసనం 17%, అనారోగ్యం వల్ల 16%, కుటుంబ సమస్యలు వల్ల14% ఆత్మహత్యలు జరిగినట్లు నివేదికిలు చెబుతున్నాయి.

ADSI నివేదిక ప్రకారం ప్రమాద మరణాలు ట్రాఫిక్ ప్రమాదాలు 40%, 2020లో పోలిస్తే 11% తగ్గాయి.
2020లో 3,74,397 ప్రమాద మరణాలు ఏర్పడ్డాయి.
2019తో పోలిస్తే ఇలాంటి మరణాలు 11.1% తగ్గాయి.
సహజ కారణాల వల్ల మరణాల సంఖ్య కూడా 9.1% తగ్గింది.
వడదెబ్బ కారణంగా మరణించిన వారి సంఖ్య 2019, 2020 మధ్య 744 తగ్గింది.

మొత్తానికి రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోయిన వారికంటే గత ఏడాది ఆత్మహత్యలు వల్ల చనిపోయిన వారిసంఖ్యే ఎక్కువగా ఉంది. బిగ్ బాస్ హోస్ లా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం వల్ల కొన్ని కుటుంబాల్లో అక్రమసంబంధాలు బయటపడి లేనిపోని గొడవలు అయ్యాయి. కొంతమంది అయితే మంచి టైం దొరికిందని ఎంజాయ్ చేసినవాళ్లు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే 2020 ఏంతోమంది జీవితాలను తలకిందులు చేసిందనే చెప్పాలి.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news