Bigg Boss 5: బిగ్ బాస్.. బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం చేయాల్సినవసరం లేని బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఈ షో ప్రేక్షకులకు కావాల్సినంత మాజాను అందిస్తూ.. నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఈ షో ఆరంభం నుంచే ఇది ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. హౌస్లో కంటెస్టెంట్లు చేసే రచ్చ మమూలుగా లేదు.
గొడవలు, ఏడుపులు, దుర్భాషలా పురాణంతో రసవత్తరంగా నడుస్తోంది. మిగితా సీజన్ల కంటే… ఈ సీజన్ చాలా విభిన్నంగా ఉందనే చెప్పాలి. వారం మొత్తం సరదాగా ఉన్నా కంటెస్టెంట్లు.. వారాంతంలో నామినేషన్ అనగానే ఒకరంటే.. ఒకరికి అసలు పడటం లేదు. బద్దశత్రువులుగా మారుతున్నారు. ఇలా కంటెస్టెంట్లందరూ.. కావాల్సినంత డ్రామా క్రియేట్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ సీజన్ సక్సెస్ పుల్ గా రన్ అవుతుంది.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్ లో విజయవంతంగా రెండు ఎలిమినేషన్లు పూర్తయ్యాయి. తొలి ఎలిమినేషన్‍లో సరయు హౌస్ నుంచి వెళ్లిపోగా.. రెండవ ఎలిమినేషన్‍లో ఉమాదేవి బయటకు వచ్చేంది. తాజా మరో ఎలిమినేషన్‌కు రంగం సిద్దమైంది. అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్న నామినేషన్ ప్రాసెస్ సోమవారం ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించిన ప్రోమో నేడు విడుదల అయ్యింది. ఈ ప్రోమో చూస్తుంటే.. మరోసారి ఇంటి సభ్యుల మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధమే జరిగినట్లు ఉంది.
ఈ వారం కూడా మానస్, శ్రీరామ్ ల మధ్య మాటల తూటాలు పేలేట్లు ఉన్నాయి. వారి మధ్య గొడవ అలాగే కంటిన్యూ అయ్యేట్లు కనిపిస్తుంది. ఇక.. సన్నీ, ప్రియ మధ్య కూడా వార్ ఓ రేంజ్‌లో నడిచేలానే ఉంది. ప్రియను సన్నీ నామినేట్ చేసినట్లు కనిపిస్తుంది. గతవారం ప్రియ.. వాడు వీడు అని.. దమ్ముంటే మగాడిలా ఆడు అని సన్నీ మీద నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. ఆ విధంగా మాట్లాడి నందుకే..
ఇలా నామినేట్ చేసి.. రివేంజ్ తీర్చుకుంటున్న అని సన్నీ అన్నాడు. సన్నీ మాటలకు ప్రియ నవ్వుతూ.. చప్పట్టు కొడుతూ కనిపించింది.
మరోవైపు లహరి కూడా ప్రియని నామినేట్ చేసినట్టు కనిపించింది. సేఫ్ గేమ్ ఆడుతున్నావని ప్రియ అంటే.. ఇది సేఫ్ గేమ్ కాదు.. సేఫ్ గేమ్ అనుకుంటే ఇక్కడ చాలామంది ఉన్నారని నామినేషన్ చేయడానికి అని లహరి కౌంటర్ ఇచ్చింది. ఇక జబర్దస్త్ ప్రియాంక.. హమీదాను కడిగి పాడేసినట్టు కనిపించింది. చెండాలమైన, పనికి మాలిన రీజన్లతో నామినేట్ చేస్తున్నావని కౌంటర్ వేసింది.
మరోవైపు… జేస్సీ, నటరాజ్ మాస్టర్ల మధ్య మాటల యుద్దం జరిగినట్టు కనిపించింది. ‘ సిరి చెప్తే .. నువ్ నన్ను నామినేట్ చేశావని నాకు తెలుసని, నువ్వు చిన్నపిల్లోడివి.. జుజూ అని జేస్సీని నటరాజ్ మాస్టర్
కామెంట్ చేశారు. జెస్సీ అదే తరహాలో రియాక్ట్ అయ్యాడు. అవును.. నేను చిన్నపిల్లోడినే రిప్లే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సమయంలో విశ్వ.. నటరాజ్ మాత్రం మీద ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు. ఇదేనా నువ్ లేడీస్‌కి రెస్పెక్ట్ అని అన్నాడు.
అనంతరం యాంకర్ రవి .. జెస్సీని టార్గెట్ చేశాడు. ఎన్నిరోజులు చిన్న చెడ్డీలు వేసుకుని .. ఆ చిన్న దెబ్బ చూపిస్తూ.. సింపథీ కోసం తాపత్రపడుతావ్ అని ఏకిపారేశాడు. బిగ్ బాస్ ఓ మంచి ప్లాట్ ఫామ్.. ఈ స్టేజ్‌ని వేస్ట్ చేసుకుంటున్నావేమో అనిపిస్తుందని జెస్సీ మీద ఫైరయ్యాడు. మొత్తానికి ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ హీట్ పెంచినట్లుగానే తెలుస్తోంది.