భీమ్లా నాయక్ : గత్తర లేపిన డానియల్‌ శేఖర్‌ టీజర్

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన… అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాను పవన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.అయితే.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే.. ఈ సినిమా “భీమ్లా నాయక్ ” టైటిల్ ను ప్రకటించి పవన్ ఫాన్స్ లో ఊపు తెప్పించింది.

అయితే తాజాగా భీమ్లా నాయక్ సినిమా నుంచి రానా టీజర్ వచ్చేసింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కు ఎదురు నిలిచే కీలకమైన డేనియల్ శేఖర్ పాత్రలో రానా అలరించనున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా రానా టీజర్ ను వదిలింది చిత్రబృందం. ఇక ఈ టీజర్ లో హీరో రానా తన పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఇక రానా టీజర్ విడుదల కావడంతో భీమ్లా నాయక్ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. కాగా అంతకు ముందు రిలీజ్ అయిన పవన్ టీజర్ మరియు ఫస్ట్ సాంగ్ యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news